College girls protest over beard in indore video: చాలా మంది ఇటీవల కాలంలో వెరైటీ స్టైల్ లలో గడ్డం ను పెంచుకుంటున్నారు. కొంతమంది ఫారీన్ స్టైల్ లను కాపీ కొడుతున్నారు. మరికొందరు యువత పిల్లి గడ్డంను ఇష్టపడుతుంటారు. కాలేజీలో ఉన్నప్పుడు అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేందుకు రకరకాల గడ్డాల స్టైల్ లను అబ్బాయిలు ఫాలో అవుతుంటారు. కొంత మంది సినిమా హీరోల గడ్డాలను సైతం కాపీ కొడుతుంటారు. ఇదిలా ఉండగా.. సాధారణంగా గడ్డం అనేది అందరికి ఇష్టముండదు.
Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024
కొందరు గడ్డంను ఎంతో ఇష్టంతో పెంచుకుంటే.. మరికొంత మంది క్లీన్ గా షేవ్ ఉంచుకొవడం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. అంతే కాకుండా.. గడ్డం అనేది కొంత మంది ఫెస్ కు అడిషనల్ కళగా కన్పిస్తుంది. కానీ మరికొందరు మాత్రం గడ్డం పెంచుకోకుండా క్లీన్ షేవ్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో కాలేజీ అమ్మాయిలు గడ్డం ఉన్న వాళ్లంటే ఇష్టంలేదని ఏకంగా ర్యాలీలు తీసి మరీ నిరసనలు చేపట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గర్ల్ ఫ్రెండ్స్ కావాలంటే.. తప్పకుండా షేవ్ చేసుకొవాలని కూడా వాళ్లు నినాదాలు చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని మరీ వారు కాలేజీ తో పాటు.. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలో తిరుగుతూ తమ నిరసనలు తెలిపారు.
Read more: Viral Video: బాప్ రే.. ఎంతకు తెగించింది.. కిచెన్‌లో మూత్రం పోసి చపాతీలు.. షాకింగ్ వీడియో వైరల్..
"నో క్లీన్ షేవ్.. నో లవ్.. బియర్డ్ హటావో నైతో గర్ల్‌ఫ్రెండ్ భూల్జావో" ( గడ్డాన్ని వదులుకో.. లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను వదులుకో).. బియర్డ్ హటావో ప్యార్ బచావో ( గడ్డం తీసేయండి.. ప్రేమను పొందండి) అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఇదేం రచ్చ అంటూ కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.