Leopard Head Stuck: అటవీప్రాంతంలో జరుగుతున్న మార్పులతో వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చిరుతపులులు జనారణ్యంలోకి వస్తూ తీవ్ర కష్టాలు పడుతున్నాయి. తరచూ పులుల హల్‌చల్‌ వార్తలు చూస్తున్నాం. తాజాగా ఓ చిరుతపులి అడవి నుంచి బయటకు వచ్చింది. ఓ ఇంట్లోకి దూరిన పులి ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. రాగి బిందెలోకి దూరి నానా యాతన పడింది. దాదాపు ఐదు గంటలపాటు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Woman Wish: 'మా ఆయన బెట్టింగ్‌ మానేయాలి'.. సమ్మక్క తల్లికి భార్య రాసిన కోరిక వైరల్‌


మహారాష్ట్రలోని దుదే జిల్లా సఖ్రీ తాలుకాలోని శివర గ్రామంలో శనివారం (2 మార్చి) తెల్లవారుజామున 7 గంటల సమయంలో పులి వచ్చింది. ఓ ఇంట్లోని పశువుల కొట్టంలోకి వెళ్లింది. అక్కడ పశువులను తిందామని నక్కి కూర్చుంది. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న రాగి బిందెలోకి పొరపాటున పులి తల దూరింది. తల ఇరుక్కుపోవడంతో పులి నరకయాతన అనుభవించింది. తల బయటకు రాలేక గిలగిల కొట్టుకుంది. శబ్ధం రావడంతో ఆ ఇంటి సభ్యులు వచ్చి చూడగా పులి కనిపించింది. మొదట భయాందోళన చెందిన వారు తర్వాత పులి పరిస్థితి చూసి జాలిపడ్డారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే పులి తల ఇరుక్కుని ఇబ్బందులు పడుతుందనే సమాచారం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున చూడడానికి ఆ ఇంటికి వచ్చారు.

Also Read: Hotel Attack: హోటల్‌లో మళ్లీ రౌడీ మూక బీభత్సం.. తింటున్న వారిపై విచక్షణారహితంగా దాడి


వెంటనే ఆ ఇంటికి చేరుకున్న అధికారులు పులి ఉన్న పరిస్థితిని గమనించారు. అనంతరం పులి తలను బిందెలో నుంచి తీసే ప్రయత్నం చేశారు. మొదట పులికి పశు వైద్యులు మత్తు మందు ఇచ్చారు. అనంతరం బిందెను కోశారు.  దాదాపు ఐదు గంటల పాటు కష్టపడి పులి తలను విజయవంతంగా బిందెలోంచి బయటకు తీశారు. ఇదంతా గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. పులి తేరుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అయితే పులి నీళ్లు తాగేందుకు బిందెలోకి తల పెట్టిందని తెలుస్తోంది. తాగుతున్న క్రమంలో బిందెలో తల ఇరుక్కుందని అధికారులు భావిస్తున్నారు. అయితే తల ఇరుక్కోవడంతో పులికి గాలి కూడా అందలేదని అటవీ శాఖ అధికారిణి సవిత సోనేవాలె తెలిపారు. దీని కారణంగా ఆ పులి అస్వస్థతకు గురయ్యిందని వివరించారు.  చిరుతను బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో అధికారులు వదిలారని సమాచారం. పులిని తీసుకెళ్లడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook