Lockdown in India: కొవిడ్-19 ఫోర్త్ వేవ్ భయం, చైనాలో భారీగా కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమైన ఒమిక్రాన్ బిఎఫ్ 7 వేరియంట్ కేసులు ఇండియాలోనూ నమోదవడం వంటి పరిణామాలు భారతీయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, కరోనా వైరస్ కేసుల కంటే ఎక్కువ భయపెడుతున్న మరో అంశం సోషల్ మీడియాలో నిజానిజాలతో సంబంధం లేకుండా వ్యాపిస్తున్న వదంతులు, పుకార్లే అని చెప్పుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ విపరీతంగా వైరల్ అవుతోంది. సిఇ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసిన ఒక వార్తా కథనానికి సంబంధించిన స్క్రీన్‌‌షాట్ అది. అందులో ఏమని పేర్కొని ఉందంటే.. డిసెంబర్ 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి కఠిన ఆంక్షలు అమలు చేస్తారని.. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్‌లో నిర్ణయం కూడా తీసుకున్నారని ఆ స్కీన్‌షాట్‌లో పేర్కొని ఉంది. డిసెంబర్ 24 అర్థరాత్రి నుంచే లాక్‌డౌన్ విధిస్తారని ఆ యూట్యూబ్ ఛానెల్ అవాస్తవాలను ప్రసారం చేసింది. వాస్తవానికి ఆ స్క్రీన్‌షాట్ అంతగా వైరల్ అవడానికి కారణం కూడా లాక్‌డౌన్ విధింపుపై రాసిన ఆ అసత్య కథనాలే.


ఇదే విషయమై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో తమ ఫ్యాక్ట్‌చెక్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసింది. డిసెంబర్ 24 నుంచి వారం రోజుల పాటు భారత్ బంద్ అని సిఇ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసిన వార్త అవాస్తం అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టంచేసింది. భారత ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో తేల్చిచెప్పింది. 



 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు, మెసేజులపై స్పందించి, అవి ఫేక్ కథనాల లేక నిజమా అని రూడీ చేసి చెప్పే లక్ష్యంతోనే ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్‌లో ఈ పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రారంభించింది. అప్పటి నుంచి అనేక అంశాలపై ట్విటర్ ద్వారా క్లారిటీ ఇస్తూ దేశ పౌరుల సందేహాలకు సమాధానం ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్, లాక్‌డౌన్, డిమానిటైజేషన్ తదితర అంశాలపై పిఐబి అనేక సందర్భాల్లో ఫేక్ న్యూస్ కథనాలపై స్పష్టమైన ప్రకటనలు చేసింది. 


ఇది కూడా చదవండి : Men Protested For Brides: నా వధువు ఏమైందంటూ కలెక్టరేట్ ఎదుట 50 మంది ధర్నా


ఇది కూడా చదవండి : Viral Video: బుడ్డోడి చాకచక్యం.. తల్లిని కాపాడిన వీడియో వైరల్.. చూస్తే ఔరా అనాల్సిందే..


ఇది కూడా చదవండి : 1000 Notes Coming Back: 1000 రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా ? 2 వేల నోట్లు బ్యాన్ ? ఏది నిజం ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook