Snakes Viral Video: ఇంటర్నెట్‌లో నిత్యం బోలెడన్ని వైరల్ వీడియోలు (Viral Videos) దర్శనమిస్తుంటాయి. కొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తే మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కొన్ని వీడియోలు భయపెడితే... మరికొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇలా భయానికి, ఆశ్చర్యానికి గురిచేసే వాటిల్లో స్నేక్ వీడియోలు ముందు వరుసలో ఉంటాయి. కొంతకాలంగా సోషల్ మీడియాలో స్నేక్స్ వీడియో (Snake Videos) ఒకటి వైరల్ అవుతోంది. అందులో రెండు సర్పాల సయ్యాటను గమనించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రెండు స్నేక్స్ (Snakes) ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోయి తన్మయత్వంలో మునిగితేలుతున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అల్లుకుపోతున్నాయి. సమీపంలోని పొలాల నుంచి మైదానంలోకి వచ్చిన ఆ జంట పాములు... దారిపోయేనవాళ్లకు ఇలా పెనవేసుకుని దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాలను వారు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయి. స్నేక్ వరల్డ్ అనే ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారనే వివరాలు మాత్రం తెలియరాలేదు.


స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక కళ్ల ముందు ఎలాంటి ఆసక్తికర ఘటన జరిగినా సరే... జనం వాటిని తమ సెల్‌ఫోన్లలో బంధించి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసేస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వెలుగులోకి వస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమాని సోషల్ మీడియాలో నిత్యం వైరల్ వీడియోలకు (Viral Video) కొదువ లేకుండా పోయింది.


 



Also Read: Viral Video: చేతిలో పిల్లాడు ఉన్నాడన్న కనికరం లేకుండా-చితక్కొట్టిన పోలీస్....


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook


https://bit.ly/3hDyh4GAndroid Link -