Lovers Romance on Running Bike at Gundlupet Road Karnataka: టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది.. మనుషులు కూడా దారుణంగా తయారవుతున్నారు. హద్దుహదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు రహస్యంగా ప్రేమించుకునే ప్రేమికులు.. ఇప్పుడు బహిరంగంగానే తిరుగుతున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే దారుణంగా రెచ్చిపోతున్నాయి. నడిరోడ్డు మీద ఉన్నామా, పబ్లిక్‌లో ఉన్నామా అని కూడా ఆలోచించకుండా రొమాన్స్‌లో మునిగిపోతున్నారు. వారు చేసే పనులకు సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇలాంటి సంఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"228410","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"2":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


 


కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మున్సిపాలిటీ పరిసర ప్రాంతంలో ఓ ఇద్దరు ప్రేమికులు రోడ్డుపైనే ఆదమరిచి ప్రవర్తించారు. ప్రియుడు బైక్ నడుపుతుండగా.. ప్రేయసి పెట్రోల్ ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని రొమాన్స్ చేసింది. ప్రియురాలు ముద్దుల వర్షం కురిపించగా.. అతగాడు లోకాన్నే మైమరచిపోయాడు. ఎంతలా అంటే.. ఎదురుగా భారీ వాహనం వస్తున్నా అదేమీ పట్టించుకోలేదు. ప్రియుడు కూడా ముద్దులతో రెచ్చిపోయాడు.


[[{"fid":"228405","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]  


పల్సర్‌ బైక్‌పై ఇద్దరు ప్రేమికులు పట్టపగలే రొమాన్స్ చేసుకుంటుండడంతో అటుగా వెళుతున్న వాహన దారులు ఆశ్చర్యానికి  గురయ్యారు. నడి రోడ్డుపైనే ప్రేమికులు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వీడియో చుసిన అందరూ వారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 'కలికాలం బాబోయ్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మరో అర్జున్ రెడ్డి' అని ఇంకొకరు కామెంట్ చేశారు.


[[{"fid":"228413","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"3":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


 


ఇలాంటి వారిని పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బహిరంగంగా ఇలా రెచ్చిపోవడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. ఈ అనుచిత దృశ్యాలను జీ న్యూస్‌ బృంందం రికార్డ్‌ చేసింది. జీ కర్నాటక న్యూస్‌ ఛానెల్‌లో ప్రసారం చేసింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.


Also Read: Airtel Data Plan: ఎయిర్‌టెల్ చీపెస్ట్ డేటా ప్లాన్ వచ్చేసింది.. జియో కంటే తక్కువ!


Also Read: MS Dhoni Record: ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఒకే ఒక్కడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


Data PlanAirtel vs JioAirtel Data planAirtelJio