Madeenaguda Pochamma Thalli Idol Drinking Milk: కొన్నిసార్లు దేవాలయాలలో అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. దేవుడు కళ్లు తెరిచిచూసినట్లు ఉంటాయి. విగ్రహాంలో ఏదో కదలికలు ఏర్పడతాయి. ఆలయంలో రాత్రిపూట వింత ఆకారాలు సీసీ ఫుటేజీలో రికార్డు అవుతుంటాయి. చాలా మంది హిందు సంప్రదాయంలో దేవాలయలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. మనకు ఎన్నిరకాల ఇబ్బందులున్న కూడా దేవాలయాలకు వెళ్లి పూజిస్తే ఇట్టే మన ప్రాబ్లమ్స్ దూరమైతాయని చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. కొన్నిసార్లు దేవుళ్ల విగ్రహాలు పాలు తాగిన ఘటలు వార్తలలో నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దేవుడి విగ్రహాం ముందు స్పూన్ తో పట్టుకొగా నిముషాల వ్యవధిలోనే పాలు మొత్తం మాయమైన ఘటనలు మనం చూశాం.  కొందరు దీన్ని మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం.. అమ్మవారి మహిమలు అంటు కొలుచుకునే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ లోని మదీనాగుడాలో ఒక దేవాలయంలో అమ్మవారు పాలుతాగుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 


పూర్తి వివరాలు..


హైదరాబాద్ లోని మియాపూర్ లో మదీనాగుడాలో వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పోచమ్మ ఆలయంను స్వయంభూగా వెలసిందని చెప్తుంటారు. ఇక్కడ అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా ఆశీర్వదిస్తుందని అంటారు. ఈ నేపథ్యంలో.. ఇటీవల మూడు రోజుల నుంచి అమ్మవారు పాలుతాగుతుండటంను పూజారీ గుర్తించారు.  దీన్ని మూడు రోజుల నుంచి ఆయన ఒక్కరే గమనించారు. కానీ ఈరోజు మాత్రం ఆలయ అధికారులకు చెప్పినట్లు పూజారీ నవీన్ కుమార్ చెప్పారు. వెంటనే ఆలయ అధికారులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా.. వారి ముందే అమ్మవారికి స్పూన్ తో పాలు తాగించి చూపించారు.


అమ్మవారి విగ్రహాం ముందు స్పూన్ పెట్టగానే, స్పూన్ లోని పాలన్ని అయిపోయాయి.  ఇది చుట్టుపక్కల వారందరికి తెలిసింది. దీంతో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి భక్తులు పొటేత్తారు. చుట్టుపక్కల వారంతా భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా.. భక్తులు పాలగిన్నెలతో ఆలయానికి చేరుకుని పాలు తాగించే ప్రయత్నంచేస్తున్నారు.


Read more: Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..


అంతేకాకుండా ఈ పోచమ్మ ఆలయం స్వయంభూగా వెలసిందని, ఇక్కడి ప్రజలకు కొంగుబంగారంగా మారిందని కూడా భక్తులు చెబుతుంటారు. ఇంతటి  పవిత్రమైన ఆలయంలో అమ్మవారు పాలుతాగుతుండటం పల్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి శకునం అని పూజారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈవీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter