Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

Hyderabad: వాకర్స్ నడిచే మార్గంలో ఉదయాన్నే ఇద్దరు బీర్ బాటిళ్లు తీసుకుని తాగుకుంటూ నిలబడ్డారు. అక్కడున్న వారు ఇది వాకర్స్ నడిచే ప్లేస్ అని మరోచోటికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వారు మద్యం మత్తులో బూతులు తిట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Last Updated : May 24, 2024, 05:29 PM IST
  • తాగి రోడ్డుమీద గొడవకు దిగిన యువతి..
  • సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్న నెటిజన్లు..
Drunken couple: తప్పతాగి రోడ్డు మీద హల్ చల్.. వాకర్స్ మీద రెచ్చిపోయిన యువతి.. వీడియో వైరల్..

Woman halchal on road after drinking Liquor:  తాగి వాహనాలను నడిపించోద్దని పోలీసులు ఎంతగా చెప్తున్న కొందరు మాత్రం అస్సలు మారడం లేదు. తప్పతాగి రోడ్ల మీదకు వస్తుంటారు. అంతే కాకుండా.. రోడ్డుమీద ఇష్టమున్నట్లు వాహనాలను నడిపిస్తుంటారు. తమ ప్రాణాలను కాకుండా ఎదుటి వారిని కూడా డెంజర్ లో పడేస్తుంటారు. తాగి రాంగ్ రూట్ లో వెళ్తుంటారు. కారుల్లో సీట్ బెల్టులు పెట్టుకోరు. హెల్మెట్ లు పెట్టుకొకుండా ట్రిబుల్ రైడింగ్ చేస్తుంటారు. పోలీసులు తరచుగా వాహనాలను తనిఖీలు చేస్తుంటారు. బ్రీత్ ఎనలైజర్ లో కొందరు అడ్డంగా దొరికిపొతుంటారు. ఇలాంటి సందర్భాలలో పోలీసులతోనే వాగ్వాదానికి దిగుతుంటారు చాలా మంది పోలీసులపైన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేటప్పుడు దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు.

 

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడాలేకుండా రోడ్ల మీద పడుతున్నారు. అంతటితో ఆగకుండా నానా బీభత్సం చేస్తున్నారు. పొరపాటున వీరిని ఆపేందుకు ఎవరైన ప్రయత్నిస్తే ఇక వారిని బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

పూర్తి వివరాలు..

హైదరాబాద్‌ - నాగోల్‌లో  ఉదయాన్నే ఇద్దరు మందుబీర్ బాటిళ్లు పట్టుకుని, రోడ్డు మీదకు వచ్చేశారు. అంతటితో ఆగకుండా.. వాకర్స్ డైలీ నడిచే మార్గంలో తాగుకుంటూ న్యూసెన్స్ చేశారు. అక్కడ చిన్న పిల్లలు, సీనియర్ సిటిజన్లు, ఎందరో వాకింగ్ చేస్తున్నారు. కొందరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాంటూ వారిని సూచించారు. కానీ తాగిన మైకంలో ఉన్న దంపతులు మాత్రం వీరిని అస్సలు లెక్కచేయలేదు. మీరెవరూ..మమ్మల్ని అనడానికి అంటూ నోటికొచ్చినట్లూ బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా..  మీరు తాగారా.. అంటూ రివర్స్‌ లో దాడికి దిగుతూ కాసేపు న్యూసెన్స్ చేశారు.  చుట్టుపక్కల వారు వీడియోలు తీస్తుంటే, అందరిని నోటికొచ్చినట్లూ దూశించారు. ఈ నేపథ్యంలో కొందరు వారిని వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. కాసేపు అక్కడ పెద్ద న్యూసెన్స్ ఏర్పడింది.

Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

ఒక నోక సమయంలో ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకొండంటూ కూడా సదరు మహిళ.. పోన్ రికార్డు చేస్తున్న వారిపై దాడికి ప్రయత్నించింది.  అక్కడికి చేరుకున్న కొందరు ఇది మంచి సంప్రదాయం కాదంటూ చెప్పడానికి ప్రయత్నించారు.  మొత్తానికి ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన కొందరు నెటిజన్లు, మన హైదరాబాద్ పరువు తీశారంటూ కూడా ఫైర్ అవుతున్నారు. మరికొందరు చూస్తే ఇద్దరు కూడా చదువుకున్న వాళ్లలాగా ఉన్నారు.. ఇదేం సంస్కారం అంటూ కూడా ఏకీపారేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News