అతనో సాధువు.... కానీ ఆయన ఏం చేశాడో తెలిస్తే మాత్రం ముక్కుమీద వేలేసుకోక మానరు. ఇంతకీ అతను చేసిన ఘనకార్యమేమిటో తెలుసా?


ఇప్పటివరకు మనము ఎన్నో సాహసాలను చూసి ఉంటాము. చేతులతో, కాళ్లతో, మీసాలతో, పళ్లతో కూడా వాహనాలను లాగిన వాళ్లను చూసి ఉంటాం. కానీ ఈ సాధువు చాలా స్పెషల్.ఏకంగా మర్మాంగానికి తాడు కట్టి ట్రాక్టర్‌ను లాగి.. అందరి చేత వారెవ్వా అనిపించుకున్నాడు. అలహాబాద్‌లో నిర్వహించిన మాఘ్ మేళాలో ఈ సాధువు ఈ ప్రదర్శన చేశాడు. సాధువు చేసిన సాహసాన్ని చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఈ సాధువే 2014లో ఓసారి పదుల సంఖ్యలో ఇటుకలను మర్మాంగాన్ని కట్టుకొని ప్రదర్శించాడు. ఏదేమైనా సాధువు గట్టిపిండమే..! అని అక్కడున్న వారందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆ సాధువు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.