Mahesh babu murari rerelease couple married in theatre video goes viral: ప్రిన్స్ మహేష్ బాబు బర్త్ డే నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన ఆయన భారీ కటౌట్ లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరోవైపు చిత్ర‌బృందం మురారీ మూవీ రిరీలీజ్ కూడా చేశారు.మురారీ మూవీ.. 2001 లో వచ్చింది. దీనికి కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. మహేష్ బాబు కెరియర్ లో ఇది గొప్ప సినిమా అని చెప్పవచ్చు. ఇది బ్లాక్ బాస్టర్ హీట్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికి కూడా ఆ సినిమాకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలా ఉండగా.. మురారీ రిరీలీజ్ అయిన థియేటర్లన్ని ఆడియన్స్ తో ఫుల్ గా ఉన్నాయి. ఎక్కడ చూసిన, మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ తో కన్పిస్తున్నారు. అనేక పలు థియేటర్లలో బ్యాండ్ లు , డీజేలను కూడా ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ప్రస్తుతం మురారీ సినిమా హౌస్ ఫుల్ షోలతో నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఒక థియేటర్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇదికాస్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు.. 


మురారీ రీరిలీజ్ నేపథ్యంలో ఒక జంట.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సినిమాలో మహేష్ బాబు.. సోనాలీ బింద్రే పెళ్లి సమయంలో అలనాటి రామచంద్రుడికన్నింట సాటి.. అనే పాట వచ్చినప్పుడు.. ఇద్దరు ప్రేమికులు నిజంగా పెళ్లి చేసుకున్నారు.. యువకుడు.. పసుపు తాడు తీసి.. యువతి మెడలో కట్టాడు. దీంతో అక్కడున్న వారంతా.. కూడా వారి మీద అక్షింతలు వేసీ ఆశీర్వదించారు.


Read more: Hyderabad: బాబోయ్.. కండక్టర్ పై కోపంతో బ్యాగ్ లోని పామును విసిరిన వృద్ధురాలు .. వీడియో వైరల్..


అంతేకాకుండా.. వీరిద్దరు కూడా మహేష్ బాబు ఫ్యాన్స్  అంట. అందుకే తమ అభిమాన హీరో బర్త్ డే, మురారీ రిరీలీజ్ రోజు పెళ్లి చేసుకున్నారంట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొందరు దీన్నిసపోర్ట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషేస్ చెప్తున్నారు. ఆయన పేరు మీద గుళ్లలో ప్రత్యేకంగా పూజలు కూడా జరిపిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter