Man Bathing with King Cobra in Lake: పాములు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే. అందులో కింగ్ కోబ్రా జాతికి చెందిన పాములు ఇంకెంత ప్రమాదకరమైనవో మాటల్లో చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి పాములతోనే కొందరు సాహసాలు చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకొని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు "వీడేంటి రా బాబు ఇలా కింగ్ కోబ్రాకు స్నానం చేయించడం"  అని ఆశ్చర్యపోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది పాములను పట్టుకుని సురక్షిత సురక్షిత ప్రాంతాలలో వదిలేస్తూ ఉంటారు. మరికొందరైతే వాటిని సాధా జంతువుల్లాగా కూడా పెంచుకుంటారు. ఇవి ప్రమాదకరమైన వని తెలిసినప్పటికీ ఎంతో రిస్క్ చేస్తూ వాటిని పెంచుకునే వారు కూడా ఉన్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన పెంచుకున్న కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



ఇక వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తన పెంపుడు పాము శరీరాన్ని శుభ్రం చేసేందుకు ఏకంగా కొలనులో స్నానం చేయించేందుకు తీసుకువచ్చాడు. అంతేకాకుండా ఆ తొమ్మిది అడుగులు గల భారీ కింగ్ కోబ్రాకు ఆయన ఏమాత్రం భయపడకుండా స్నానం చేయించాడు. ఇలా స్నానం చేయించే క్రమంలో ఆ కోబ్రా అతని కళ్ళల్లోకి ఐదు సెకండ్ల పాటు అలానే చూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్


ఇలాంటి సాహసాలు చేసేవారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. పాముకు ఆహారం పెట్టే వీడియోలు, నీటిని తాగించే వీడియోలు ఇప్పటికీ చూసి ఉంటాను కానీ.. ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసింది. ఇలా చేయడం ప్రమాదకరమైనప్పటికీ.. పెంపుడు జంతువులు యజమానులకు ఎలాంటి హాని కలిగించవని.. మరికొందరు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిపారు.


ఈ వైరల్ అవుతున్న వీడియోను జగడ్ ముండా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను 47 వేల మందికిపైగా లైక్ చేయగా.. ఈ పామును చూసి భయపడిన వారు కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సాక్షాత్తు మహా శివుడే స్నానం చేస్తున్నట్లుగా కామెంట్లు రాసుకువచ్చారు


Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook