Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..
king cobra bathing video: కింగ్ కోబ్రా మీద నీళ్లు పోశాడు. అంతటితో ఆగకుండా దాని మీద షాంపు కూడా వేశాడు. దాన్ని చక్కగా తొముతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Man bathing venomous cobra snake with shampoo video Viral: పాములంటే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాముల పేరు ఎత్తడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా పాములు కొండలు, అడవులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ పొలాలల్లో కూడా ఇవి ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొన్నిసార్లు పాములు అనుకోకుండా మనుషులను కాటు వేస్తుంటాయి. చాలా మంది పాములకు ఆపద కల్గించకూడదని భావిస్తారు. అందుకే పాములు కన్పించగానే, స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. కొందరు పాములు కన్పిస్తే దేవతలా భావిస్తారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటాయి.
నెటిజన్లు కూడా పాములకు సంబంధించిన వెరైటీ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో కొన్ని భయంకరంగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉంటాయి. కొన్ని వందల రకాల పాములు మనదేశంలో కన్పిస్తుంటాయి. పాములన్ని విషపూరితమైనవి కావని చెబుతుంటారు. కేవలం కొన్ని మాత్రమే అత్యంత విషపూరీతమైనవని అవి కాటు వేస్తే నిముషాల్లో వ్యవధిలో చనిపోతారని చెబుతారు. ఇక పాములు కాటు వేసిన తర్వాత సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్తే చాలా మట్టుకు, ప్రాణాలతో బైటపడోచ్చు. అయితే.. ఎండాకాలమో.. మరేంటో కానీ. ఒక వ్యక్తి పాముకు స్నానంచేయిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
పూర్తి వివరాలు..
చాలా మంది ఇంట్లో కుక్కలను, పిల్లుల్ని ఇళ్లలో పెంచుంతుంటారు. ఇక్కడోక వ్యక్తి మాత్రం వెరైటీగా పామును పెంచినట్టున్నాడు. అది ఎండకు తాళలేక ఇబ్బందులు పడుతుందని అనుకున్నట్లున్నాడు. ఈ క్రమంలో పాముకు స్నానం చేయించాడు. పైప్ తో పాము మీద నీళ్లుపోసి, దానికి షాంపుకూడా పెట్టాడు. అంతటితో ఆగకుండా.. పై నుంచి కింద వరకు అచ్చం మనిషిలాగా మర్దన కూడా చేశాడు.
Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం పైత్యం రా బాబోయ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పామును కూడా పెంచుకుంటారా.. అని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పొరపాటున కాటు వేస్తే, నీ పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించావా.. అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.