Haryana Dead Man: అద్భుతం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు.. ఎలాగంటే..?
Dead Man Comes Alive in Haryana: హర్యానాలో చనిపోయాడని అనుకున్న ఓ వ్యక్తి మళ్లీ బతికాడు. అనారోగ్య కారణాలతో మరణించినట్లు వైద్యులు ప్రకటించగా.. అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తుండగా గుంతల మీదుగా వెళ్లడం ఒక్కసారిగా ఆయనలో కదలికలు వచ్చాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాణాలతో ఉన్నారని వైద్యులు తెలిపారు.
Dead Man Comes Alive in Haryana: చనిపోయిన వ్యక్తి మళ్లీ బతుకుతాడా..? అసాధ్యం కాదా..! కానీ హర్యానాలో చనిపోయిన ఓ వ్యక్తి మళ్లీ బతికాడు. 80 ఏళ్ల ఓ వృద్ధుడిని వైద్యులు మరణించారని ధృవీకరించగా.. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో గుంతల రోడ్డు మీదుగా అంబులెన్స్ వెళ్లడంతో ఆ వ్యక్తిలో కదలికలు వచ్చాయి. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాపాయ స్థితిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..
హర్యానాకు చెందిన దర్శన్ సింగ్ బ్రార్ సింగ్ అనే ఓ వృద్ధుడు కొన్ని రోజులు క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఆయన మనవడు బల్వాన్ సింగ్ ఆయనను చికిత్స కోసం పాటియాలాలోని ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ఉండగా.. గురువారం ఉదయం ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ నుంచి దింపగా.. మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో అంబులెన్స్‌లో దర్శన్‌ను ఇంటికి తీసుకువెళ్తున్నారు.
అప్పటికే దర్శన్ మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బంధువులు అంతా అంత్యక్రియలకు వచ్చారు. ఒక టెంట్ ఏర్పాటు చేసి.. దర్శన్‌కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దహన సంస్కారాలకు కలప కూడా తీసుకువచ్చరు. బంధువులకు భోజనాలకు కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వాళ్ల ఇంటికి దాదాపు 100 కి.మీ దూరం ఉంది. ఈ క్రమంలో అంబులెన్స్ గుంతల రోడ్డులో వెళ్లింది. ఆ తాకిడికి దర్శన్‌లో కదలిక వచ్చింది. ఆయన చేయి కదలడం చూసిన మనవడు.. వెంటనే డ్రైవర్‌ను అంబులెన్స్ ఆపమని చెప్పాడు.
పల్స్ చెక్ చేయగా.. గుండె కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. అంబులెన్స్ డ్రైవర్‌ని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లమని కోరాడు. తాతయ్య బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు ఫోన్ సమాచారం అందించాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు దర్శన్ బ్రార్ బతికే ఉన్నారని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన కర్నాల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. దర్శన్ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అద్భుతం జరిగిందని సంబరపడిపోతున్నారు.
Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook