Man Flying In Clouds: మనిషికే రెక్కలొస్తే ఎంత బాగుంటుంది.. పక్షిలా గాల్లోకి ఎగిరిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది.. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఆ ఊహే అంత అద్భుతంగా, ఆనందంగా ఉంటే.. మరి ఆకాశంలో మబ్బుల మధ్యలోంచి నిజంగానే ఎగురుతూ ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఏంటి.. మేఘాల్లో ఎగరడమా !! అదేలా సాధ్యం అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మేఘాలను తాకుతూ వాటి మధ్యలోంచే ఎగురుతూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి తల్చుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం యావత్ ప్రపంచాన్ని తెచ్చి మనిషి అరచేతిలో పెడుతోంది. అలా అందిపుచ్చుకున్న టెక్నాలజీ సహాయంతోనే నేడు మనిషి ఆకాశ వీధిలో పక్షిలా విహరిస్తున్నాడు. అందులోనూ విమానంలో ప్రయాణించడం ద్వారా ఆకాశ వీధుల్లో ఎగిరి రావడం ఒకటైతే.. పారాచూట్ సహాయంతో నింగిలోంచి ఎగురుతూ నేలపైకి సురక్షితంగా దిగి రావడం మరొకటి. ఈ రెండింటి గురించి చాలా మందికి తెలుసు కాబట్టి అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు కానీ ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం అందరినీ షాక్‌కి గురిచేస్తున్నాడు. 



ఆమాటకొస్తే.. ఒక మనిషి ఇలా పక్షిలా గాల్లో ఎగరడం అనేది ఇదేం తొలిసారి కాదు.. ఇదేం మొదటి వీడియో కాదు.. కానీ మేఘాలను తాకుతూ ఆకాశమంత ఎత్తులో విహరిస్తున్న మనిషి వీడియో మాత్రం అరుదైంది కావడంతో నెటిజెన్స్ ఈ వీడియోను ఆశ్చర్యంగా వీక్షిస్తూ సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. నేలపైనుంచి మేఘాలను అందరూ చూస్తారు.. విమానంలో ప్రయాణిస్తూ కూడా చాలా మంది చూసే ఉంటారు. కానీ ఆకాశంలో ఎగురుతూ మేఘాలను దగ్గరి నుంచి ఎంత మంది చూస్తారు చెప్పండి.. నెటిజెన్స్ కూడా ఇలాంటి రియాక్షన్సే ఇస్తున్నారు.


Also Read : Viral Video: రెస్ట్ రూమ్‌కు వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త..ఎందుకో వీడియో చూడండి..!


Also Read : Python Video: 20 అడుగుల భారీ కొండచిలువలతో ఆడుకుంటున్న అమ్మాయి, వీడియో వైరల్


Also Read : Viral Video: ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలు దక్కేవి కాదు.. తృటిలో పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తండ్రి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook