Bihar Marriage News: అత్త-అల్లుడు ప్రేమలో పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా అక్రమ సంబంధం కొనసాగించారు. చివరికి వీరి వ్యవహారం తెలుసుకున్న మామ.. తన భార్యకు అల్లుడితో వివాహం జరిపించారు. బీహార్‌లోని బంకాలో ఈ వింత ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛత్రపాల్ పంచాయతీ హీర్ మోతీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లుడి పేరు సికందర్ యాదవ్ (45) కాగా.. అత్త పేరు గీతాదేవి (55). స్థానికుల వివరాల మేరకు.. సికందర్ యాదవ్ తన భార్య మరణించిన తరువాత తన అత్తమామలతో కలిసి జీవిస్తున్నాడు. సికిందర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమయంలో అత్త గీతాదేవికి దగ్గరయ్యాడు అల్లుడు సికిందర్ యాదవ్. వీరి ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: OU Hostels Close: ఓయూ హాస్టల్స్‌ బంద్‌పై తీవ్ర దుమారం.. మాజీ సీఎం కేసీఆర్‌ స్పందన ఇదే!


వీరి వ్యవహారంపై అనుమానం వచ్చి గీతాదేవి భర్త దిలేశ్వర్ దర్వే.. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఇద్దరు కూడా అసలు నిజం ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. పంచాయితీ, గ్రామస్తుల ముందు తన అత్తపై ఉన్న ప్రేమను మరింతగా చాటుకున్నాడు సికందర్. అందరి ముందు అత్త అంటే తనకు ఇష్టమని చెప్పాడు. గీతాదేవి భర్త తన భార్య-అల్లుడికి వివాహం జరిపించాడు. అంతేకాదు కోర్టులో పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి అనంతరం అందరూ ఒకే ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వింత వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నట్లు సికిందర్ యాదవ్ తెలిపాడు. 


 




ఉత్తరప్రదేశ్‌లో పెళ్లికి ముందు జరిగిన వేడుకలలో సిగరెట్ తాగుతూ తన అత్త గారు డ్యాన్స్‌ వేశారని ఓ యువకుడు పెళ్లి రద్దు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పెళ్లి వేదిక వద్దకు చేరుకున్న తర్వాత వరుడు తన కాబోయే భార్య తల్లి వేడుకల్లో పాల్గొని సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేయడం చూసి షాక్ అయ్యాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పెళ్లిని ఆపేయాలని కోరాడు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఆ తరువాత పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఇద్దిరికి పెళ్లి జరిపించారు.


Also Read: YS Jagan Convoy: కాన్వాయ్‌ కిందపడ్డ కుక్క.. చలించిపోయిన సీఎం వైఎస్ జగన్‌ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter