Big python on bed video goes viral: సాధారణంగా ఇళ్లలో ఎవరైన కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెల్ని పెంచుకుంటారు. కానీ కొంత  మంది ఏనుగుల్ని సైతం పెంచుకుంటారు. కానీ కొందరైతే.. పాములు, కొండ చిలువల్ని సైతం పెంచుకుంటారు..ఇప్పటికే కొందరు కోండ చిలువల్ని మెడలో వేసుకుని, ఇళ్లలో తిప్పుకుంటూ హల్ చల్ చేసిన వీడియోలు గతంలో అనేకం వార్తలలో నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా.. కొంతమంది కొండచిలువులతో ఆడుకొవడం, వాటిని తమ ఇళ్లలో పెంచుకున్న వీడియోలు సైతం వైరల్ గా మారాయి. అయితే.. పాములు, కొండ చిలువలు చాలా డెంజర్అని, అవి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాయో.. ఎవరుచెప్పలేరని అంటుంటారు.కొన్ని సందర్భాలలో అవి దారుణంగా హనీని కల్గజేస్తాయంటారు. అందుకే విష జీవులతో ఎప్పటికైన డెంజర్ గానే ఉంటుందని కూడా చాలా మంది అలర్ట్ చేస్తుంటారు.


 



కానీ కొంత మంది ఈమాటల్ని విని అలర్ట్ అయితే.. మరికొందరు మాత్రం తమ లైఫ్ ను రిస్క్ లో పడేసుకుంటారు. ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.



పూర్తి వివరాలు..


సొషల్ మీడియాలో పాములు, కొండ చిలువల వైరల్ వీడియోలకు బాగా డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు. నెటిజన్లు సైతం.. వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో.. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఒక వ్యక్తి మరీ తన ఇంట్లో భారీ కొండ చిలువను పెంచుకుంటున్నాడో మరేంటో కానీ.. అతని బెడ్ మీద అని బిందాస్ గా పడుకుని ఉంది.


అతని కాళ్ల దగ్గర మరో పెంపుడు కుక్కకూడా ఈ వీడియోలో కన్పిస్తుంది. అతను మాత్రం ఏదో బుక్ చదువుకుంటూ.. ఆ అనకొండ భారీ శరీరాన్ని తన దిండులా చేసుకుని పడుకున్నట్లు తెలుస్తొంది.అది బెడ్ మీద అటు ఇటు పాకుతున్న అతను మాత్రం ఏ మాత్రం రెస్పాండ్ కావడంలేదని తెలుస్తొంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాప్.. రే అంటూ షాక్ అవుతున్నారు.


Read more: Snake Bite: వదల బొమ్మాళీ.. వదల.. ఒకే యువతిని 11 సార్లు కాటేసిన నల్ల పాము.. ఆస్పత్రిలో కూడా..?


మరికొందరు మాత్రం.. ఇదేందిరా.. వీడి ధైర్యం అంటూ సెటైర్లు వేస్తున్నారు. అది మింగేయల గలదు.. బీ అలర్ట్ అంటూ మరికొందరు అతడికి వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.