Viral Video: ఉన్నట్టుండి కుప్పకూలిన శునకం.. నోట్లో నోరు పెట్టి ఊది బతికించాడు
CPR to Dog: మానవత్వానికి ప్రతీకగా నిలిచే తాజా గటన అమెరికాలోని లాస్ ఎంజెలస్లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి శునకానికి సీపీఆర్ చేసి దానిని బతికించాడు.
CPR on Dog: మనుషులకు అత్యంత నమ్మకంగా ఉండే జంతువులుగా శునకాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క సారి అవి ఎవరినైనా నమ్మాయంటే.. ఎప్పటికీ అవి వారిని వదిలి పెట్టవు.
అందుకే చాలా మంది ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటాయి. ఈ కారణంగా మనుషులకు కూడా శునకాలపై అమితమైన ప్రేమ ఉంటుంది. అయితే తాజాగా శునకాలు అంటే మనుషులకు ఎంత ఇష్టమో చెప్పే ఓ వీడియోలో నిరూపితమైంది. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ సంఘటన గురించి తెలుసుకుందాం పదండి.
ఆ వీడియోలో ఏముందంటే..
అమెరికా లాస్ ఎంజెలస్లోని ఓ పార్కు బయట ఓ మహిళ వాకింగ్‌కు తీసుకొచ్చిన శునకం ఉన్నట్టుండి కింద పడిపోయింది. పార్క్‌లోకి ఎంటర్ అయ్యే కొన్ని క్షణాల ముందే ఈ ఘటన జరిగింది. దీనితో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. గడ్డిగా అరుస్తూ.. సహాయం కోసం పక్కన ఉన్నవాళ్లను పిలిచింది.
ఈ గమనించిన ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చాడు. కింద పడిపోయిన కక్కును గమనించగా.. అది శ్వాస తీసుకోడం లేదని గుర్తించాడు. దీనితో మనుషులకు అలాంటి పరిస్థితి వస్తే చేసే సీపీఆర్ (కార్డియోపాల్మోనరి రిసాసిటేషన్) నిర్వహించాడు.
నోట్లోకి గాలి ఊది..
ముందుగా ఆ శునకం గుండెపై చేతులు పెట్టి కుదిపాడు ఆ వ్యక్తి. అయినా అది స్పందించలేదు దీనితో ఆ శునకం నోట్లో నోరు పెట్టి గాలి ఊదాడు. మళ్లీ గుండెను కుదిపాడు.. కొద్ది సేపు అలా చేయగా.. ఆ కుక్క తిరిగి ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది.. కొన్న క్షణాల్లోనే పైకి లేచి నిలబడింది కూడా.
దీనితో ఆ శునకాన్ని బతికించాం అంటూ.. సీపీఆర్ నిర్వహించిన వ్యక్తి, కుక్కను తీసుకొచ్చిన మహిళ, ఈ వీడియోను తీసిన వ్యక్తి తమ అనందాన్ని వ్యక్తం చేశారు.
నిజంగానే.. ఓ శునకాన్ని ఇలా బతికించడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను Goodable అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి మానవత్వానికి ప్రతీకగా నిలిచిన సంఘటన అనే అర్థం వచ్చేట్లు క్యాప్షన్‌ను జోడించారు.
జనవరి 30న ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటికే 2.12 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఆ కుక్కను కాపాడిన వ్యక్తి కూడా ఈ వీడియోకు కామెంట్ చేశారు. ఆ శునకం తీసుకొచ్చిన మహిళతో మాట్లాడి.. కొన్న జాగ్రత్తలు కూడా చెప్పినట్లు వివరించారు. దానిని కొద్ది సేపు పరిగెత్తించొద్దని కూడా సూచించినట్లు చెప్పాడు.
Also read: Pushpa Dance Viral Video: పుష్ప డ్యాన్స్ మేనియా.. అల్లు అర్జున్‌ని ఇమిటేట్ చేయబోయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook