Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..
Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Man steals ambulance video goes viral: సాధారణంగా దొంగలు కాస్లీ కారులు, బంగారం, షాపులలో చోరీలకు పాల్పడుతుంటారు. కొన్ని చోట్ల దారి కాచీ ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని దారికాచీ చోరీలు చేస్తుంటారు. బైక్ ల మీద వచ్చి.. చోరీలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం ఒక వ్యక్తి ఏకంగా పార్క్ చేసి ఉన్న అంబులెన్స్ ను చోరీ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
హైదరబాద్ శివారులోని.. హయత్ నగర్ లో 108 వాహనాన్ని నిలిపిఉంచారు. అక్కడ ఒక వ్యక్తి దానిలో ప్రవేశించి స్టార్ట్ చేసి విజయవాడ వైపు స్పీడ్ గా పొనిచ్చాడు దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. అతగాడిని ఛేజ్ చేశారు. కానీ అతను మాత్రం.. సినిమా లెవల్ లో పోలీసులకు దొరక్కుండా రచ్చ చేశాడు.
చిట్యాల వద్ద అంబులెన్స్ ను ఆపే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో అతను.. అంబులెన్స్ తో ఢీకొట్టి పారిపోయినట్లు తెలస్తొంది. దీంతో జాన్ ఎగిరి పక్కకు పడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరొవైపు.. కేటుగాడు.. కేతేపల్లి (మం)కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయినట్లు తెలుస్తొంది.
పోలీసులు మాత్రం.. సూర్యాపేట (మం)టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు అడ్డంపెట్టడంతో.. దొంగ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook