Pushpa 2 Movie: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో గూస్ బంప్స్.. పూనకాలతో ఊగిపోయిన మహిళలు.. వీడియో వైరల్..

Pushpa 2 The rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా థియటర్ లకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో కొన్ని  థియేటర్ లలో మహిళ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తొంది.   

Written by - Inamdar Paresh | Last Updated : Dec 7, 2024, 02:46 PM IST
  • పూనకాలతో ఊగిపోతున్న మహిళలు..
  • పుష్ప2 ప్రదర్శిస్తున్న థియేటర్ లో ఘటన..
Pushpa 2 Movie: పుష్ప2 మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో గూస్ బంప్స్.. పూనకాలతో ఊగిపోయిన మహిళలు.. వీడియో వైరల్..

Pushpa 2 the rule woman fans punakalu video: పుష్ప2 ది రూల్ ప్రస్తుతం అన్నిరికార్డులను తిరగ రాస్తుంది.ఈ నేపథ్యంలో ఈ మూవీ చూసేందుకు  అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ లకు వెళ్తున్నారు. ముఖ్యంగా పుష్ప2 మూవీలో తిరుపతి గంగమ్మ జాతర హైలెట్ అని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ జాతర ఈ మూవీకి ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ జాతర ఉన్న సీన్ లో.. అల్లు అర్జున్ చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం, పూనకంతో ఊగిపోవడం, ఆయన డ్యాన్స్ మాత్రం ఒక అదిరిపోయిందని చెప్పుకొవచ్చు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా అల్లు అర్జున్ ఫెక్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తున్న ఆడియన్స్ మాత్రం, ఆయన నటనకు ఫిదా అవుతున్నట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ ఫెస్ ఎక్స్ ప్రెషన్స్, గూస్ బంప్స్ తెప్పిస్తున్న మ్యూజిక్ వింటుంటే.. థియేటర్ లో ప్రతి ఒక్కరు కూడా సీట్ల నుంచి నిలబడి మరీ బన్నీ నటనకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాలో ఈ గంగమ్మ జాతర సీక్వెల్.. బన్నీకి అమ్మవారు పూనీన సీన్ లను చూసి.. కొంత మంది మహిళలు సీట్లలో తమకు కూడా.. గంగమ్మ దేవత పూనీనట్లు ఊగిపోయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read more: Allu Arjun: మీకు సిగ్గు, శరం ఉందా..?.. అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అడ్వకేట్ ..

గతంలో అమ్మోరు, కాంతార సమయంలో కూడా .. థియేటర్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర మ్యూజీక్ విని ఒళ్లంత జలదరించి.. పూనకాలు వచ్చినట్లు ఆడియన్స్ ఊగిపోతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News