Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్గా మారిన వీడియో..
Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Snakes viral video: పాములు కన్పిస్తే ఎవరైన దూరంగా వెళ్తిపోతారు. మనుషులే కాదు.. నోరులేని జీవాలు సైతం పాములు కన్పిస్తే వెంటనే అక్కడి నుంచి జారుకుంటాయి. ఇక పులులు, సింహాలు, ఏనుగులు సైతం పాముల జోలికి అస్సలు పోవు. అవి పడగ విప్పి మరీ ఇతరు జీవుల్ని భయపెడుతుంటాయి. పాములు అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి.
అదే విధంగా పాములు.. పొలాలల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. కొంత మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. నెటజన్లు సైతం పాముల వైరల్ వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఒక పాముల వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఆ కేటుగాడి మీద ఫైర్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక కేటుగాడు.. రోడ్డుపక్కన వెళ్తున్న కింగ్ కోబ్రాను రోడ్డు మీదకు తీసుకొచ్చి.. ఇష్టమున్నట్లు దాన్ని అటు ఇటు తిప్పుతూ టార్చర్ చేశారు. దీంతో కింగ్ కోబ్రా పలు మార్లు అతడ్ని కాటు వేసేందుకు ప్రయత్నించింది.
Read more: Viral Video: వామ్మో.. శివయ్యల మారిన వానరం.. మెడలో కింగ్ కోబ్రాతో హల్ చల్.. వీడియో ఇదిగో..
అయిన కూడా అతను పాము కాటు నుంచి తప్పించుకుని అక్కడ రచ్చ రచ్చ చేశాడు. పాపం.. కింగ్ కోబ్రాను రోడ్డుమీద తొకను పట్టుకుని లాగుతూ.. క్రూరంగా ప్రవర్తించాడు.ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం ఫైర్ అవుతున్నారు. అతడిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.