Manchu Vishnu:  మంచు విష్ణు హై బడ్జెట్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్  ‘కన్నప్ప’ సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా న్యూజిలాండ్ లో అలానే ఆంధ్రప్రదేశ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుందని ఈ మధ్యనే తెలియచేశాడు. కాగా ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుండగా అక్కడ మంచు విష్ణు కి గాయాలైనట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్పగా ఈ చిత్రంలో విష్ణు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ ఈ  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్టర్ న్యూజిలాండ్‍లో చిత్రీకరిస్తుండగా మంచు విష్ణుకు గాయమైనట్టు సమాచారం బయటికి వచ్చింది. అంతేకాదు ఈ సీక్వెన్స్ అడుగుతున్నప్పుడు ఓ డ్రోన్ విష్ణు మీద కుప్పకూలిందని, అది ఆయన పైన పడటం వల్ల ఆయన చేతికి గాయాలు అయ్యాయి అని తెలుస్తుంది.


ఇక ఇది జరిగిన వెంటనే విష్ణుని షూటింగ్ దగ్గర నుంచి తరలించారు అని ఇక షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.


మంచు విష్ణు గాయం గురించి ప్రముఖ సినీ ఎనలిస్ట్ రమేశ్ బాల ట్వీట్ చేశారు. “తన కలల ప్రాజెక్ట్ భక్త కన్నప్ప షూటింగ్‍లో న్యూజిలాండ్‍లో బిజీగా ఉన్న మంచు విష్ణు.. ఓ యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగా గాయపడ్డారు. అనధికారవర్గాల సమాచారం ప్రకారం, విష్ణుపై డ్రోన్ కుప్పకూలడంతో అతడి చేతికి కొన్ని గాయాలయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. అతడి గాయం గురించి మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు” అని రమేశ్ బాల పోస్ట్ చేశారు. 


కాగా ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook