Medaram Hundi Slip: దక్షిణ భారతదేశ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారక్క జాతర ముగియగా ప్రస్తుతం హుండీ లెక్కింపు జరుగుతోంది. కోటిన్నర మందికి పైగా భక్తులు తరలిరావడంతో భారీగా కానుకలు వచ్చాయి. పెద్ద ఎత్తున హుండీలు నిండడంతో దేవాదాయ శాఖ లెక్కింపు చేపట్టింది. గతానికన్నా అధిక రీతిలో హుండీ ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. అయితే హుండీ లెక్కింపులో ఓ భక్తురాలు రాసి వేసిన చిట్టీ బయటపడింది. ఆమె తన కోరికలను ఓ చీటీ రూపంలో రాసి అమ్మవారికి సమర్పించాలని భావించింది. అయితే ఆ చీటీని హుండీలో వేసింది. ఇప్పుడు హుండీ లెక్కింపు సమయంలో ఆ చీటీ బయటపడడంతో ఆసక్తికరంగా మారింది. ఆ చీటీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు


మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులు కొనసాగుతోంది. ఆదివారం ఐదో రోజు హుండీ లెక్కింపు సమయంలో ఒక చీటి వచ్చింది. ఆ చీటిని జాగ్రత్తగా తెరిచి పరిశీలించగా ఓ మహిళ తన భర్త, తన అక్క కుమారుడి కోసం రెండు కోరికలు కోరింది. అయితే వాటిలో ఒక కోరిక మాత్రం విచిత్రంగా ఉంది. తన భర్త బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని.. వాటిని మానేసేలా చేయాలని అడవి తల్లులను కోరుకుంది. 'మా ఆయన బెట్టింగ్ మానేయాలి. మా అక్క కొడుక్కి ఐఐటీలో సీటు రావాలి' అని ఆ భక్తురాలు అమ్మవార్లను కోరుతూ చీటీ రాసి హుండీలో వేసింది. ఇది చూసిన హుండీ లెక్కింపు సిబ్బంది ఫొటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో పెట్టారు. 

Also Read: Mother Call Saved: కనిపించే దైవం అమ్మ ఇదిగో సాక్ష్యం.. తల్లి 'ఫోన్‌'తో కుమారుడికి పునర్జన్మ


ఆ చీటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భక్తురాలు ఎంత ప్రేమగా కోరుకుందో అని కామెంట్లు చేస్తున్నారు. భర్త పట్ల భార్యకు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని మరికొందరు చెబుతున్నారు. 'బెట్టింగ్‌ అనేది వ్యసనం. అది మానదు తల్లీ. అమ్మవార్లు కూడా ఏం చేయలేరు' అని నెటిజన్లు సూచిస్తున్నారు. 'సమ్మక్క సారలమ్మ తల్లులు ఆ భక్తురాలి కోరిక నెరవేర్చు' అని కామెంట్లు పెడుతున్నారు. 'బెట్టింగ్‌ మాయలో చిక్కుకుంటే బయటకు రాలేం. పాపం ఆమె భర్త బెట్టింగ్‌తో ఎన్ని తిప్పలు పడుతుందో. అందుకే మేడారం వచ్చి సమ్మక్క సారక్కలను కోరుకుంది. అడవి తల్లులయినా ఆమె భర్తను మారేలా చేయాలి' అని కోరుతున్నారు.


హుండీ లెక్కింపు ఇలా..
ఈసారి జాతర నాలుగు రోజుల్లో 1.45 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో భారీగా ఆదాయం లభిస్తోంది. హుండీలు నిండుకోవడంతో లెక్కింపు చేయడానికి చాలా ఆలస్యమవుతోంది. మేడారం హుండీ లెక్కింపును గురువారం (29 ఫిబ్రవరి) మొదలుపెట్టారు. మొత్తం 518 హుండీలు ఉన్నాయి. 450 వాలంటీర్లు హుండీ లెక్కింపు చేపడుతున్నారు. మూడు రోజులు కలిపి రూ.9.60 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయం వచ్చినట్టు బ్యాంక్‌ల్లో జమ చేస్తున్న ఆలయ ఈవో రాజేంద్రం తెలిపారు. మరో ఐదు రోజులు హుండీ లెక్కింపు కొనసాగుతుందని తెలుస్తోంది. కాగా గత జాతర (2022) హుండీ ఆదాయం రూ.11.44 కోట్లు రాగా.. ఈసారి గతం కంటే అధికంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి