Bengaluru Cafe Blast: బెంగళూరులో బాంబు పేలుళ్ల సంఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. చాలా రోజుల తర్వాత దేశంలో బాంబు పేలుళ్ల సంఘటన జరగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ కేసును త్వరిగతిన విచారణ జరుపుతుండగా.. విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడికి తల్లి ఫోన్ కాల్ పునర్జన్మ ఇచ్చింది. తల్లి ఫోన్ కాల్ ద్వారా ఆ యువకుడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డాడు.
Also Read: LPG Gas Cylinder Stole: దర్జాగా 'కారు'లో వచ్చి 'సిలిండర్' దొంగలించిన యువకులు
కర్ణాటకలోని బెంగళూరు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో (1 మార్చి) శుక్రవారం మధ్యాహ్నం బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన పది మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాంబు పేలుళ్లు జరగడానికి క్షణాల ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినవారు ప్రాణాలతో బయటపడ్డారు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని పునర్జన్మ పొందారు. అయితే ఓ యువకుడికి మాత్రం తల్లి ఫోన్ కాలే అతడికి ప్రాణం పోసినట్టు అయ్యింది. పేలుళ్ల సమయంలో తల్లి ఫోన్ చేయడంతో బయటకు వచ్చాడు. అతడు అలా బయటకు వచ్చాడో లేడో పేలుడు సంభవించింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఈ ఘోరం జరగడంతో ఆ యువకుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే అక్కడి నుంచి దూరంగా జరిగాడు. జరిగిన విషయాన్నంతా తన తల్లికి వివరించాడు.
Also Read: Cyber Fraud: అమ్మాయి పేరుతో అబ్బాయి వేషాలు.. జూనియర్ ఆర్టిస్ట్ లీలలు మామూలుగా లేవు
అతడి పేరు కుమార్ అలంకృత్. బిహార్‌లోని పాట్నాకు చెందిన కుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. భోజనం చేసేందుకు రామేశ్వరం హోటల్‌కు వచ్చాడు. ఇడ్లీ, దోశ ఆర్డర్ ఇచ్చి తినేందుకు సిద్ధమవుతుండగా తల్లి ఫోన్ చేయడంతో కుమార్ బయటకు వచ్చాడు. అలా వచ్చాడో లేదో పేలుడు సంభవించిందని కుమార్ మీడియాతో చెప్పాడు. 'తల్లి కనిపించే దైవం అని ఈ ఘటనతో నాకు తెలియవచ్చింది. మా అమ్మ ఫోన్ చేయడంతో బయటకు వచ్చానో లేదో ఇలా పేలుడు జరిగింది. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డా. భారీ శబ్ధంతో పేలుళ్లు సంభవించింది. కొన్ని సెకండ్ల పాటు నా చెవులు మూగబోయాయి'
'ప్రమాదం అనంతరం హోటల్‌లో భీతావహ దృశ్యాలు కనిపించాయి. ఓ మహిళ చేతులు తెగి పడి ఉంది. తీవ్రంగా గాయపడిన మరో మహిళను చూశా.హోటల్ సిబ్బంది కూడా గాయపడ్డారు' అని ఆ ప్రమాద దృశ్యాలను కుమార్ వివరించాడు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శిస్తున్నారు. మీకు అండగా మేమున్నామని భరోసా ఇస్తున్నారు. బాంబు పేలుళ్లకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. విచారణ త్వరితగతిన చేపట్టి నిందితులను పట్టుకుంటామని పోలీస్ శాఖ ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook