మీరు స్పైడర్ మేన్ ( Spriderman ) సినిమాలు చాలా సార్లు చూసి ఉంటారు. కానీ నిజజీవితంలో ఎప్పుడైనా గోడపై సులువుగా అచ్చం స్పైడర్ మేన్ లా ఎక్కి దిగే వ్యక్తిని చూశారా ? లేదా అయితే ఈ రోజు అలా గోడలపై ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎక్కే పిల్లాడిని మీకు పరిచయం చేస్తాం. ఈ కుర్రాడు వేగంగా గోడలు ఎక్కేయగలడు.



స్పైడర్ మేన్ గురించి అందరికీ తెలిసిందే. మనందరం స్పైడర్ మేన్ సినిమాలు, కార్టున్లు చూశాం. కానీ నిజజీవితంలో అలా జరిగితే ఎలా ఉంటుంది. ఒక మనిషి గోడలపై పాకెస్తే ఎలా ఉంటుంది?



ఉత్తర్ ప్రదేశ్ లోని ( Uttar Pradesh ) కాన్పూర్ కి చెందిన ఏడేళ్ల బాబు స్పైడర్ మేన్ లా ఎలాంటి సపోర్ట్ లేకుండా గోడలు ఎక్కేస్తాడు దిగేస్తాడు. ఏడేళ్ల యసార్థ్ సింగ్ ( Yasarth Singh ) ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్నాడు. కానీ ఇప్పటికే అతని పాపులారిటీ ఊరంతా పాకేసింది. ఎందుకంటే సినిమాలో చూసే స్టంట్స్ అతను సులువుగా చేసి చూపిస్తాడు. 



అచ్చం సూపర్ హీరోలా ( Super Hero )ఎలాంటి సపోర్ట్ లేకుండా గోడలపైకి ఎక్కేస్తాడు. టీవీలో స్పైడర్ మేన్  సినిమాలు చూసి ఇలా ఎక్కడం ప్రారంభించాను అని చెబుతున్నాడు యసార్థ్. స్పైడర్ మేన్  గోడలు ఎక్కినప్పుడు నేను ఎందుకు ఎక్కకూడదు అని ఆలోచించాడట. వెంటనే ట్రై చేయడం ప్రారంభించాడు కూడా.



అయిత ఈ కుర్రాడు గోడలు ఎక్కడం సాహసమే అయినా.. అలా ఎక్కేసి దిగే సమయంలో ఎక్కడ కింద పడి దెబ్బలు తగిలించుకుంటాడో అని అతని తల్లి భయపడుతోందట. పెద్దయ్యాక ఐపిఎస్ ఆఫీసర్ అవుతాడట. దేశానికి స్పైడర్ మేన్  లా సేవ చేస్తాడట.