Dhoni Funny Interaction With Fan: అమెరికా పర్యటన ఎంజాయ్ చేస్తోన్న టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూఎస్ ఓపెన్ యాక్షన్‌లో కార్లోస్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని ఎంజాయ్ చేయడమే కాకుండా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన వీడియోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. తన మనసుకు నచ్చిన పనులు చేస్తూ అమెరికా టూర్ ఎంజాయ్ చేస్తోన్న మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన వార్తలు, విశేషాలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒక వీడియో గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అమెరికాలో తారసపడిన ఓ అభిమాని తన వద్ద ఉన్న ఒక చిన్న క్రికెట్ బ్యాట్‌పై తన ఫేవరైట్ క్రికెటర్ ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. తన వద్దకు వచ్చే అభిమానులతో సాధ్యమైనంత వరకు ఎంతో మర్యాదగా నడుచుకునే ఈ మిస్టర్ కూల్.. అభిమాని కోరిక మేరకు అతడికి స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిచ్చాడు. 


ఆటోగ్రాఫ్ చేసే సమయంలో తన చేతిలో తన గారాలపట్టి జీవా ధోని కోసం కొనుగోలు చేసి పెట్టుకున్న చాక్లెట్స్ బాక్సు ఉండటంతో.. తను ఆటోగ్రాఫ్ చేసేంత వరకు ఆ చాక్లెట్స్ బాక్సు పట్టుకోవాల్సిందిగా సూచిస్తూ అభిమాని చేతికి ఇచ్చాడు. అభిమానికి చెందిన బ్యాట్‌లపై సంతకం చేయడం పూర్తయిన తర్వాత ఆ బ్యాట్ ని అభిమానికి అందజేస్తూనే తన చాక్లెట్‌లను తనకు తిరిగి ఇవ్వమని నవ్వుతూ అడిగి తీసుకున్నాడు. ధోనీకి, ధోని అభిమానికి మధ్య జరిగిన ఈ కొద్దిపాటి సరదా సంభాషణ అక్కడే ఉన్న మీడియా కెమెరాలకి చిక్కకుండాపోలేదు.


మహేంద్ర సింగ్ ధోనీకి అమెరికా ఏంటి.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా అక్కడ అభిమానులు ఆయన వెంట పడటం ఎప్పుడూ చూసేదే. ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటమే అందుకు కారణం. ధోనీ అభిమానుల జాబితాలో సాధారణ జనమే కాదు.. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. తన ఆటతో, తన మనస్తత్వంతో అంతమంది మనసుల చూరగొనడంలో ధోనీ సక్సెస్ అయ్యాడు.


ఐపిఎల్ కెరీర్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదో సారి ఐపిఎల్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలే తన మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అలాగేతన స్వస్థలమైన రాంచీలో తరచుగా అయినప్పటికీ, ధోని తన వద్ద ఉన్న లగ్జరీ కార్లు నడుపుతూ, అలాగే స్పోర్ట్స్ బైక్‌లపై చక్కర్లు కొడుతూ నడుపుతూ ఉండటం మీడియా కంటపడకపోలేదు.