Messaging App WhatsApp : ఫేస్‌బుక్‌ కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత యూజర్లకు షాకిచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధిలో 2 మిలియన్ల (20 లక్షల) భారతీయుల వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసింది. భారత్‌లో ఐటీ రూల్స్ కట్టుదిట్టం చేసిన తొలి రిపోర్టులో ఈ విషయాలు వెలుగుచూశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 15 నుంచి జూన్ 15 మధ్యకాలంలో భారత్‌కు చెందిన 20 లక్షల వినియోగదారుల వాట్సాప్ ఖాతాలను సంస్థ బ్లాక్ చేసింది. ప్రతినెలా కాంప్లియన్స్ రిపోర్ట్, తాజా చర్యల వివరాలు నెలవారీగా అందించాలని ఐటీ రూల్స్ ఇటీవల సవరించారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో మెస్సేజ్‌లు ఫార్వర్డ్ చేస్తున్న ఖాతాలను, వివాదాలు, అల్లర్లు చెలరేగేలా సందేశాలు పంపుతున్న ఖాతాలను బ్లాక్ చేసినట్లు వాట్సాప్ రిపోర్ట్‌ (Whatsapp Grievance)లో పేర్కొంది. వీటకి సంబంధించి పూర్తి వివరాలతో మరో 30 నుంచి 40 రోజుల్లో వివరాలతో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపింది. వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేయడం 2019 నుంచి గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రతినెలా దాదాపు 8 మిలియన్ల వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అవుతున్నాయి. 


Also Read: Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి


అన్‌ఎన్‌క్రిప్టెడ్ సమాచారాన్ని సైతం కొందరు వినియోగదారులు షేర్ చేస్తున్నారని, కొన్ని ప్రొఫైల్స్ వివరాలలో తప్పిదాలు గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. అకౌంట్ బ్యాన్ చేయాలని రిక్వెస్ట్, ప్రొడక్ట్ సపోర్ట్, అకౌంట్ సపోర్ట్, భద్రతాపరమైన (Whatspp Privacy Policy) అంశాలకు సంబంధించి మొత్తం 345 రిపోర్టు అందుకున్నామని తెలిపింది.


వినియోగదారుల విజ్ఞప్తితో పూర్తిస్థాయిలో వివరాలు చెక్ చేసి కొన్ని అకౌంట్స్ తిరిగి పునరుద్ధించిన సందర్భాలు అనేకమని స్పష్టత ఇచ్చింది. భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమలులోకి వచ్చాయి. దాంతో నెలవారీగా వాట్సాప్ కాంప్లియన్స్, ఇతరత్రా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత్‌లో నివాసం ఉండేలా ముగ్గురు అధికారులను వాట్సాప్ నియమించింది.


Also Read: SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook