Neem Tree Milk Viral: ప్రకృతిలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటాయి. ప్రకృతి ఊహకు అందని విశేషాలు.. సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతుంటాయి. ఇటీవల శివలింగం చుట్టూ నాగుపాము సంచరించిన వీడియో వైరల్‌ కాగా.. తాజాగా వేప చెట్టు నుంచి పాలు కారడం ఏపీలోని నంద్యాల జిల్లాలో ఆసక్తికరంగా మారింది. చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారడంతో స్థానికులు వేపచెట్టుకు పూజలు చేశారు. అయితే ఈ వింతను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Snake: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి .. వీడియో వైరల్..


నంద్యాల జిల్లా  ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వేప చెట్టు నుంచి పాలలాంటి ద్రవం కారుతూ కనిపించింది. చెట్టు పై నుంచి కింద వరకు తెల్లటి ద్రవం కారుతూ వేప చెట్టు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఈ విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి విషయం తెలిసింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివచ్చి ప్రకృతి వింతను తిలకించారు.

Also Read: King Cobra: నోట్లో మరో పాము పట్టుకుని కింగ్ కోబ్రా అరాచకం.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..


వేప చెట్టు నుండి పాలలాంటి తెల్లటి ద్రవం కారుతూ ఉండడంతో   గ్రామ ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా తరలివచ్చారు. విరామం లేకుండా పాలు కారడం చూసి ఇది దైవ మహిమగా భావించి అనేక మంది భక్తులు తరలివచ్చి వేప చెట్టుకు  పూజలు చేశారు. మరి కొంతమంది వేప చెట్టు నుంచి కారుతున్న  పాలను కవర్లలో నింపుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. ఇదిలా ఉంటే భారీగా కురిసే వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి పాలు రూపంలో ఉన్న ఒక ద్రవం కారుతోందని ప్రకృతి నిపుణులు చెబుతున్నారు.
 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి