Brave girl catch snake with her bare hands in office video: వర్షాకాలంలో పాములు ఎక్కువగా అడవులు,చెట్టు ఉన్న ప్రదేశాల నుంచి బైటకు వస్తుంటాయి. చాలా మంది పాముల్ని చూసి భయపడిపోతుంటారు. పాములంటే వెన్నులో ఒకరకమైన వణుకు ఉంటుంది. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా పాములంటే అస్సలు భయపడరు. పామును పట్టుకుని ఆటాడుకుంటారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే భయంకరంగా ఉంటే,మరికొన్ని మాత్రం ఫన్నీగాను ఉంటాయి. నెటజన్లు సైతం పాముల వీడయోలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.
మహాతల్లి 😅 నీకో దండం .. అంత సింపుల్ గా pic.twitter.com/6MtsjY9Csz
— CEO Voice (@CeoVoice_) July 28, 2024
ఎలుకలు, చిట్టెలుకల వేటలో పాములు మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. వీటికి అపకారం తలపెడితే దోషాలు చుట్టుకుంటాయని కూడా పెద్దలు చెబుతుంటారు. అందుకే పాములకు అపకారం చేయడం మానుకొవాలని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో.. పాములకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఇటీవల కాలంలో చాలా మంది పాములు పగబడుతాయా.. అని కూడా ఆలోచిస్తున్నారు.
యూపీలోని యువకుడిని ఇప్పటి దాక ఏడు మార్లు పాము కాటేసింది. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో పాములకు చెందిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక యువతి ఆఫీసులో నక్కిన పాము దగ్గరకు వెళ్లింది. అదేదో.. వయర్ ను, దారం బెండల్ ను చేతితో పట్టుకున్నట్లు పామును పట్టేసుకుంది. అంతటితో ఆగకుండా ఆ పాము గురించి డెమో కూడా ఇచ్చింది.
Read more: Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?
ఆ పాము విషపూరితమైంది కాదని, అది కేవలం ఎలుకల కోసమే..ఇంట్లోకి ప్రవేశిస్తుందని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. పాము కరిస్తే ప్రాణాపాయం ఉండదని కూడా చెప్పింది. ఆ తర్వాత పామును పట్టుకొని, అక్కడే ఉన్న బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్న చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం ధైర్యం రా బాబోయ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter