Model Fall Down: సోషల్ మీడియాలో తరచుగా కొన్ని వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అనేక షాకింగ్ వీడియోలు సహా ఫన్నీ వీడియోలు ట్రెండింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు అభ్యంతరకర వీడియోలూ నెటిజన్ల కంటపడుతుంటాయి. ఇబ్బందికరంగానూ ఉండే వీడియోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడతాయి. అలాంటి ఓ అభ్యంతరకరమైన వీడియో ఒకటి వైరల్ గా మారింది. స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేస్తున్న ఓ మోడల్ కాలు జారీ కింద పడింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేసే మోడల్స్ చాలా బ్యాలెన్సింగ్ గా నడవాలి. వాళ్లు హై హీల్స్ ధరించే కారణంగా నడకలో కొద్దిగా పట్టు తప్పినా.. కింద పడిపోతుంటారు. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ర్యాంప్ పై నడుస్తున్న మహిళా మోడల్ కురచ దుస్తులు వేసుకొని నడుచుకుంటూ వస్తుంది. అయితే అంతలోనే ఆమె కాలు జారి కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత పైకి లేవకుండా అలానే కూర్చుంది. 


అది గమనించిన ఓ పురుషుడు (మోడల్) ర్యాంప్ వాక్ చేస్తూనే.. ఆ యువతిని తన భుజంపైకి ఎత్తుకున్నాడు. అలా ఎత్తుకొని తన ర్యాంప్ వాక్ ను పూర్తి చేశాడు. కింద జారిపడిన కారణంగా ఆమె కాలు నడనివ్వడం లేదని.. అందుకే అతడు ఆమెను భుజంపైకి ఎత్తుకున్నాడని వీడియో ద్వారా తెలుస్తోంది. యువతిని భుజంపై ఎత్తుకొని ర్యాంప్ వాక్ చేసిన మోడల్ పై అందరూ ప్రశంసలు కురిపించారు. 


ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. క్రేజీ ఫర్ కంట్రీ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పురుష మోడల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి ఇప్పటి వరకు 18 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 


Also Read: Snake Vs Rabbit Video: పాముతో యుద్ధానికి తలపడిన కుందేలు.. చివరికి ఏం జరిగిందంటే?


Also Read: Cobra Viral Video: బాత్ రూమ్ లో కింగ్ కోబ్రా.. సడెన్ గా చూసి షాకైన మహిళ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook