Viral Video: హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. ఆనందంతో పొంగిపోతున్న భక్తులు.. వీడియో ఇదిగో..
Monkey with gada in temple: వానరం ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. గద పట్టుకుని హనుమంతుడి దగ్గర కూర్చుంది. అక్కడున్న వారంతా వానరంను చూసి భక్తితో పూజలు చేసినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Monkey with gada video goes viral: ఆంజనేయ స్వామికి రామయ్య అంటే ఎంత ప్రాణమో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. హనుమంతుడు.. రామయ్యను ఎల్లప్పులు తలచుకుంటు ఉంటాడంటారు. ఎక్కడైతే.. రామయ్య ఆలయం, రామనామ స్మరణ నడుస్తుంటుందో అక్కడ.. హనుమంతుడు తప్పకుండా ఉంటారంట. అందుకే.. రామ చరిత మానస్ లేదా శ్రీ రామాయణం పారాయణ చేసే చోట తప్పకుండా.. ఒక పీఠంను హనుమంతుడి కోసం ఏర్పాటు చేసి ఉంచుతారు. హనుమంతుడు ఏ రూపంలో అయిన అక్కడికి వస్తారంట.
రామయ్యను తన గుండెలో నిలుపుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయ స్వామి. హనుమంతుడ్ని చిరంజీవి అని కూడా పిలుస్తుంటారు. అందుకే ప్రతి గ్రామంలో.. ప్రతిచోట.. హనుమంతుడి ఆలయాలు తప్పకుండా ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజించే వాళ్లకు భూత, ప్రేత, పిశాచ బాధలు, గ్రహబాధలు ఉండవంటారు. ఏదైన భయం అన్పించిన, గాలి సోకిన కూడా.. హనుమంతుడి పేరు చెప్పగానే అన్ని కూడా దూరమౌతాయంట.
అందుకే చాలా మంది హనుమంతుడ్ని, రాముడ్ని పూజిస్తుంటారు. అదే విధంగా హనుమంతుడి అవతారమైన.. వానరాలను సైతం కొందరు పూజిస్తుంటారు. ఇళ్లపైకి, గుడిల దగ్గర కోతులు కన్పిస్తే.. ఏదైన తినేందుకు ఇస్తుంటారు. అయితే.. ప్రస్తుతం ఒక వీడియోలో వానరం హనుమంతుడి ఆలయంకు వచ్చింది. అక్కడున్న గదను సైతం తనచేతితో పట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఎక్కడి నుంచి వచ్చిందొ కానీ.. ఒక వానరం హనుమంతుడి ఆలయానికి వచ్చింది. అంతే కాకుండా.. అక్కడున్న గదను పట్టుకుని.. స్వామి వారి విగ్రహాం దగ్గర కూర్చుంది. అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మరికొందరు మాత్రం.. ఏకంగా హనుమంతుడే వానర రూపంలో వచ్చాడని , దండం పెట్టుకున్నారు. వానరంకు బోట్టుపెట్టి మరీ పూజలు చేశారు. ఆ వానరం సైతం.. అక్కడున్న వారికి ఇబ్బందులు పెట్టకుండా.. కూల్ గా కూర్చుని ఉంది.
Reada more: Viral Video: తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. సిగ్గు లేకుండా ఏంచెప్తుందో చూడండి.. వీడియో వైరల్..
కాసేపటి తర్వాత వానరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఆంజనేయుడే వానరంగా వచ్చాడని అంటున్నారు. మరికొందరు మాత్రం.. కోతికి ట్రైనింగ్ ఇచ్చి.. అక్కడ కూర్చుండ బెట్టారని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైన ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.