యుట్యూబ్ ను ఎక్కువగా వీడియోలు చూడటానికి ఉపయోగిస్తాము. ఎక్కువగా సినిమాలు, పాటలు లాంటివి చూస్తాము. ఈ మధ్యకాలంలో కొన్ని సాంగ్స్ కి యూట్యూబ్ లో ఎన్నడూ లేనట్టు వ్యూస్, లైకులు పెరిగాయి. సోషల్ మీడియాలలో తెగ ట్రెండ్ అవుతుండటంతో ఆ సాంగ్స్ చూసేవారి సంఖ్య పెరిపోతోంది.


తాజాగా ఒక స్పానిష్ ఆల్బమ్ 'డిస్పేసీటో' అనే మ్యూజిక్ వీడియోను ఏకంగా 450 కోట్ల మంది చూశారు. 24 మిలియన్స్ మంది లైక్ కొట్టారు. జనవరి 12న విడుదలైన ఈ ఆల్బమ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించి యూట్యూబ్ చరిత్రనే తిరగరాసింది. ఈ ఆల్బంలో ప్యూర్టో రికాన్, లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీ తదితరులు నటించారు.