Goa Flight Ticket Prices: ఫ్లైట్ టికెట్స్ అంటేనే అమ్మో విమానమా అని గుండెలు బాదుకునేలా విమానం టికెట్ చార్జిలు తడిసి మోపెడవుతున్న ఈ రోజుల్లో ఒక విమానం టికెట్ ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 85 రూపాయల్లో ప్రయాణికులను తీసుకెళ్లిన ఆ విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేదో తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కయి, నోరెళ్లబెట్టడం మీ వంతు అవుతుంది. ఇంకా సస్పెన్స్ లో పెట్టకుండా ఫ్లైట్ డీటేల్స్ చెప్పెస్తాంలెండి. మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచి ఇండియాలో ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన గోవాకు మధ్య ట్రావెల్ చేసిన ఆ విమానం టికెట్ ధర కేవలం 85 రూపాయలు మాత్రమే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఈ విమానం టికెట్ ఇప్పటిది కాదులెండి. 1975 నాటి ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం టికెట్ ఇది. 1932 లో ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీ మొదలయ్యాకా అప్పటికి ఇప్పటికీ ఎన్నో రెట్ల అభివృద్ధి చెందింది. పెరుగుతున్న ఆర్థిక అభివృద్ధి, అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, లేటెస్ట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పుణ్యమా అని విమానయానంలో ఎన్నో మర్పులు చోటుచేసుకున్నాయి. 


1975 లో ముంబై నుంచి గోవాకు ట్రావెల్ చేసిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్‌ని తాజాగా ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అది చూసి ఈ తరం నెటిజెన్స్ అవాక్కవుతుండగా.. అప్పట్లో విమానంలో ప్రయాణించిన వారు తమ జ్ఞాపకాలను, ఆనాటి టికెట్ ధరల గురించి వారి అనుభవాలను నెటిజెన్స్‌తో పంచుకుంటున్నారు. నెటిజెన్ షేర్ చేసిన బోర్డింగ్ పాస్‌పై ఉన్న వివరాలను చూస్తే.. 11 / 2/ 1975 నాడు సదరు ఎయిర్ ఇండియా ప్రయాణికుడు ముంబై నుంచి గోవాకు వెళ్లినట్టు అర్థం అవుతోంది. 



 


ఇది కూడా చదవండి : Bear Vs Man Video: ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కబోయాడు.. కానీ అంతలోనే


1988 సెప్టెంబర్‌లో తాను ముంబై నుంచి గోవాకు వెళ్లినప్పుడు ఫ్లైట్ టికెట్ రూ. 435 ఉండేది అంటూ ఒక నెటిజెన్ తన అనుభవాన్ని పంచుకోగా.. 1974 లో మంగళూరు నుంచి ముంబైకి ఫ్లైట్ టికెట్ రూ. 280 ఉండేదంటూ మరొక నెటిజెన్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. అదే సమయంలో మరో ట్విటర్ యూజర్ స్పందిస్తూ.. 1982 లో ముంబై నుంచి అహ్మెదాబాద్ కి విమానం టికెట్ ధరలు రూ. 200 ఉండేవని చెప్పుకొచ్చాడు. ఇలా నెటిజెన్స్ ఎయిర్ ట్రావెలింగ్ ఎంత ఖరీదైంది అనే విషయంలో తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ప్రస్తుతం ముంబై నుంచి గోవాకు ఫ్లైట్ టికెట్ చార్జిల విషయానికొస్తే.. రూ. 2,300 వరకు ఉన్నాయి. కన్వినియెన్స్ చార్జీలు, ఫ్లైట్ ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ అన్నీ కలుపుకుని తక్కువలో తక్కువ 2800 రూపాయల నుంచి రూ. 3 వేల వరకు ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Real Fighting Scene: తన గాళ్ ఫ్రెండ్ ని గెలికారని ఒక్కడే ఇద్దరినీ ఉతికి ఆరేసాడు.. వైరల్ వీడియో మీరే చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK