Mysterious Underground Sounds In Kerala: భూమిలోంచి వింత వింత రహస్య శబ్ధాలు వస్తున్నాయని.. ఆ శబ్ధాల తీవ్రత చెవులు పగిలిపోయేంతగా ఉందని గ్రామస్తులు హడలిపోతున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లా చెనప్పడి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వారం ఆరంభంలోనూ ఇదే ప్రాంతంతో పాటు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ ఈ శబ్ధాలు వినిపించాయి అని చెనప్పడి గ్రామస్తులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూగర్భంలోంచి వింత శబ్ధాల వినికిడిపై గ్రామస్తులు స్పందిస్తూ.. ఇక్కడి వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని.. కానీ శబ్ధాలు మాత్రం వస్తున్నాయని అన్నారు. శాస్త్రీయంగా నిపుణులు వచ్చి పరిస్థితి సమీక్షిస్తేనే అసలు కారణం ఏంటో తెలుస్తుంది అని గ్రామస్తులు చెబుతున్నారు. 


ఇదిలావుంటే, త్వరలోనే తమ శాస్త్రవేత్తలు, ఇతర నిపుణుల బృందం ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిశీలిస్తుంది అని కేరళ రాష్ట్ర గనుల శాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు గనుల శాఖకే చెందిన మరికొంతమంది అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ వారం ఆరంభంలో తొలిసారిగా వింత శబ్ధాలు వచ్చినప్పుడే తమ బృందం ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది అని పీటీఐకి ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. 


ఇది కూడా చదవండి : king cobra videos: ఆహారం ఆలస్యమైందని యజమానిపైకే బుసలు కొట్టిన భయంకరమైన నాగుపాము


భూగర్భ అధ్యయన కేంద్రం వారు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తేనే మరిన్ని అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అని సదరు అధికారి చెప్పినట్టుగా పీటీఐ వెల్లడించింది. ఇలాంటి అంశాల పరిశీలన విషయంలో తమకు కొన్ని పరిధిలు ఉంటాయని.. ఆ పరిధులు మించి వెళ్లలేం కనుకే సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ విభాగానికి సమాచారం అందించాం అని తెలిపారు. ఏదైమైనా ప్రస్తుతం అందరిని అయోమయానికి గురిచేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ అంశం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఇది కూడా చదవండి : Video Viral: ఆట బొమ్మను అనుకొని పాముని పట్టుకొని లాక్కెళ్ళిన పిల్లాడు..చివరికి పాము ఏం చేసిందో మీరే చూడండి!


ఇది కూడా చదవండి : King Cobra Drinks Water: అచ్చం మనిషి లాగే.. గడగడ నీళ్లు తాగేసిన కింగ్ కోబ్రా! నమ్మకుంటే ఈ వీడియో చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK