Hungry Cobra Eating Food: నాగుపాము ఎపుడైన ఫుడ్ తినటం చూసారా..? వీడియో చూస్తే గుండెలు అదరటం ఖాయం

Cobra Eating food watch the Viral Video: ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక డేంజరస్ స్నేక్ వీడియో. ఆరు, ఏడు అడుగుల పొడవు ఉన్న భయంకరమైన నాగు పాముల మధ్య ఉంటూ వాటికి మాంసం ముక్కలను ఫీడింగ్ చేస్తున్న ఈ వ్యక్తి ధైర్యాన్ని చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2023, 10:18 AM IST
Hungry Cobra Eating Food: నాగుపాము ఎపుడైన ఫుడ్ తినటం చూసారా..? వీడియో చూస్తే గుండెలు అదరటం ఖాయం

Big Cobra Eating Food Video: నాగుపాము చూస్తేనే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. నాగుపాము పడగ విప్పిందా.. ఇక ఆమడదూరం పరుగెత్తుతారు. ఆ కనుచూపు మేరల్లో మళ్లీ వెళ్లమన్నా వెళ్లరు. పాములంటే కొంతమందికి అంత భయం. మరీ ముఖ్యంగా నాగుపాము లాంటి విషపూరితమైన సర్పాలను చూస్తే ఆ భయం చాలామందిలో కనిపిస్తుంది. కానీ కొంతమందికి మాత్రం ఆ పాములతోనే జీవిత కాలం గడిచిపోతుంది. పొద్దున్నే నిద్ర లేచింది మొదలు.. పడుకునే వరకు.. ఆ పాములతోనే వారి జీవితం ముడిపడి ఉంటుంది. 

అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే పాములు పట్టడం, పాములకు ఫీడింగ్ చేయడం, పాములను ఆడించడం, పాముల సంరక్షణ బాగోగులు చూడటం వంటి పనులు ఆ కోవలోకి వచ్చేవే. అందుకే వారికి పాములు అంటే ఏ మాత్రం భయం ఉండదు. ఒక్క పామును చూస్తేనే భయంతో అల్లంత దూరం పరుగెత్తే వారికి, వందలాది పాముల మధ్య ఉన్నప్పటికీ.. పెంపుడు జంతువుల మధ్య ఉన్నంత కూల్ గా ఉండే వీరికి మధ్య ఉండే తేడా అదే. 

Also Read: Shani Vakri 2023: కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ 3 రాశులకు ఊహించని ధనం.. మీరున్నారా?

ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఒక డేంజరస్ స్నేక్ వీడియో. ఆరు, ఏడు అడుగుల పొడవు ఉన్న భయంకరమైన నాగు పాముల మధ్య ఉంటూ వాటికి మాంసం ముక్కలను ఫీడింగ్ చేస్తున్న ఈ వ్యక్తి ధైర్యాన్ని చూస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాల్లో ఉన్న భయంకరమైన నాగు పాములను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న ఆ వ్యక్తి.. వాటికి ఆహారం అందిస్తున్నాడు. కానీ ఒక్క పాముకు మాత్రం ఆహారం అందివ్వడం ఆలస్యం చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News