ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది జంతుజాతులు.. అందులో వింతైన జంతువులు ఎన్నో ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు నేలపై నడిచే ఎలుగుబంటి (Bear) చూసుంటారు. ఈ రోజు మీకు నీటిలో నివసించే ఎలుగుబంటిని పరిచయం చేస్తాం. దానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన అంశాలను మీతో పంచుకుంటాం. దీని గురించి మీరు తెలుసుకుంటే ఔరా అనకుండా ఉండలేరు మీరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే


నీటిలో ఉండే ఎలుగుబంటి అంటే ?
మనం ఇప్పటి వరకు నేలపై నడిచే వివిధ రకాల ఎలుగుబంటుల గురించి చదివాం. చూశాం. కానీ ప్రపంచంలో నీటిలో నివసించే భల్లూకం కూడా ఉంటుంది.  ఇది నీటిలో ఉంటుంది. ఎలాంటి వాతావరణం అయినా.. దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోతుంది. ఈ ప్రాణికి బతకాలనే ఆశ ఎంత బలంగా ఉంటుంది అంటే ఎన్ని కష్టాలు అయినా భరిస్తుంది. ఇదోక మొండి జీవి...కరువు, వరదలు, మంచు తుపానులు కూడా ఏమీ చేయలేవు. అంతే కాదు సూర్యుడి కిరణాలు తిన్నగా దీనిమీద పడినా అది బతికి బట్టకట్టగలదు. దీన్నే టార్డిగ్రేడ్ (Tardigrade) అంటారు.  చాలా మంది దీన్ని వాటర్ బేర్ (Water Bear) అంటారు. ఇది ఊబిలో ఎక్కువగా ఉంటుంది.



Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు


విపత్తులో గమ్మత్తుగా...
పరిశోధకులు ఈ వాటర్ బేర్ గురించి పరిశీలించారు. దాని డీఎన్ ఏ డీకోడ్ (DNA Decode) చేసి దాని కణజాలం గురించి (Gene)  తెలుసుకున్నారు.  దీనిని వారు ప్లోస్ బయోలజీ (PLOS Biology)అనే జర్నల్ లో ప్రచురించారు. ఇది పెద్ద పెద్ద విపత్తుల్లో కూడా బతికి బట్టకట్టగలదు. దీనికి ఈ అద్భుతమైన శక్తి రావడానికి కారణం దాని జెనెటిక్ (Genetic ) అని పరిశోధకులు కనుక్కుకున్నారు. కరువు సమయంలో టార్డిగ్రేడ్ శరీరంలో జీన్స్ నీటిని భర్తీ చేసే పని చేస్తాయట. ఇలా కొన్ని సంవత్సరాలు పాటు అది బతకగలదట. మళ్లీ నీరు దొరికతే మాత్రం కణాలకు మళ్లీ నీళ్లు అందించగలదట.



Trans Equality: టాన్స్‌జెండర్ల పచ్చళ్ల వ్యాపారం.. లాక్ డౌన్ కష్టాలకు పరిష్కారం


ఆకారం గురించి..
నీటి భల్లూకం ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. దీనికి ఎనిమిది లావుపాటి కాళ్లు ఉంటాయి. టార్డిగ్రేడ్ తన తల, తోక ఎదుగుదలను అదుపుచేసే హోక్స్ జెనీ (HOX Gene) సంఖ్య కేవలం ఐదు మాత్రమే ఉంటుంది. దీని ఆకారం వల్లే దీన్ని జంతువుగా పరిగణిస్తారు. 



Wonder Kid: అచ్చం స్పైడరేమేన్ లా గోడలు ఎక్కేస్తున్న చిన్నారి