Trans Equality: టాన్స్‌జెండర్ల పచ్చళ్ల వ్యాపారం.. లాక్ డౌన్ కష్టాలకు పరిష్కారం

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం వ్యాప్తంగా ప్రతికూల వాతావరణం నెలకొంది. కోట్లాదిమంది నిరుద్యోగులయ్యారు. లక్షలాది సంస్థలపై ప్రభావం పడింది. కొన్ని సంస్థలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో అతి కష్టంగా బతుకునీడ్చుతున్న వారిలో హిజ్రాలు కూడా ఒకరు.

Last Updated : Sep 8, 2020, 02:26 PM IST
    • తము ఎక్కడికైనా ప్రయాణించాలి అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఎక్కనివ్వరు అని.. ఎందుకంటే ప్రజలు తమ పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు అని తెలిపారు.
    • అందుకే ఇలా ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటిని స్థాపించి సాటి టాన్స్‌జెండర్లకు మార్గదర్శకంగా ఉందామని అనుకున్నారట.
Trans Equality: టాన్స్‌జెండర్ల పచ్చళ్ల వ్యాపారం.. లాక్ డౌన్ కష్టాలకు పరిష్కారం

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ప్రపంచం వ్యాప్తంగా ప్రతికూల వాతావరణం నెలకొంది. కోట్లాదిమంది నిరుద్యోగులయ్యారు. లక్షలాది సంస్థలపై ప్రభావం పడింది. కొన్ని సంస్థలు శాశ్వతంగా మూతపడ్డాయి. ఇలాంటి సమయంలో అతి కష్టంగా బతుకునీడ్చుతున్న వారిలో హిజ్రాలు కూడా ఒకరు. మామూలుగానే వారికి ఉపాధి అవకాశాలు అత్యల్పం. దానికి తోడు లాక్ డౌన్ సమయంలో మరింత కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

అయితే హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన టాన్స్‌జెండర్లు మాత్రం సంకల్పశక్తితో లాక్ డౌన్ కష్టాలను ఓడించారు. ఇంట్లోనే కొంత మంది హిజ్రాలు ( Hijra ) ఒక చోట చేరి పచ్చళ్లు, ఇతర తిండి పదార్థాలు తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు.  Trans Equality Society

సొంత కాళ్లపై నిలుబడుతూ సాటి టాన్స్‌జెండర్లకు ప్రేరణగా నిలవాలి అని.. ఆత్మవిశ్వాసంతో సోంత వ్యాపారం ప్రారంభించే ప్రేరణ అందించేందుకు ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీని ( Trans Equality Society ) కూడా స్థాపించారు. ఇందులో ఒక సభ్యులు తను ఎదుర్కొన్న కష్టాలు, వివక్షత గురించి చెబుతున్న సమయంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. 

తను 20 సంవత్సరాల నుంచి సమాజంలో ఎదుర్కొన్న వివిక్ష నిత్యం బాధపెడుతూ ఉంది అని.. డబ్బు కోసం అడుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. తమను సమాజం నుంచి వేరు చేసి చూస్తున్నారు అని.. అందుకే బతుకునీడ్చడం చాలా కష్టంగా మారుతోంది అని తెలిపారు.

Transgenders in Hyderabad

తము ఎక్కడికైనా ప్రయాణించాలి అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఎక్కనివ్వరు అని.. ఎందుకంటే ప్రజలు తమ పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు అని తెలిపారు. అందుకే ఇలా ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటిని స్థాపించి సాటి టాన్స్‌జెండర్లకు ( Transgender ) మార్గదర్శకంగా ఉందామని అనుకున్నారట. 

మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్ స్టిట్యూట్ ( Montfort Social Institute ) తమ రంగుల కలలను సాకారం చేసుకోవడానికి సహాయం చేసింది అని తెలిపారు సొసైటి మెంబర్. 

మొదట వారు అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను రెడీ చేసి అమ్మడం మొదలు పెట్టారట.  తరువాత పాపడాలు కూడా ప్రారంభించారట. కొంత కాలం తరువాత మరికొంత మంది సభ్యులు సొసైటీలో చేరారు. అందరూ కలిసి ఇప్పుడు ప్రశాంతంగా తమ కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాము అని.. తమ కష్టానికి సామాస్య ప్రజలు కూడా అండగా నిలవాలి అని.. ప్రజలు తము తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి అని కోరుతున్నారు సొసైటీ సభ్యులు. దీని వల్ల తమ సొసైటీకి మాత్రమే కాదు ట్రాన్స్ జెండర్లకు కూడా సరైన ప్రేరణ అందుతుంది అని తెలిపారు.

Trending News