Mutton Bone Stuck In Throat: తినేటప్పుడు జాగ్రత్తగా తినాల్సి ఉంది. ఆగమాగం.. హడావుడిగా తింటుంటే కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది. తింటున్న సమయంలో గట్టి పదార్థాలు నోటిలో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా మాంసాహారం తినే సమయంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలా మాంసం తింటూ గొంతులో ముక్కలు ఇరుక్కుని కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇటీవల గొంతులో క్యారట్‌ ముక్క అడ్డుపడి చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పెద్దాయన గొంతులో మటన్‌ ముక్క ఇరుక్కుపోయింది. అయితే వైద్యులు సాహసంతో వైద్యం చేయడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం


 


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కకకిరేన్‌ గ్రామానికి చెందిన శ్రీరాములు (66) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆయనకు దవడ పళ్లు లేవు. వృద్ధాప్యంతో పళ్లు లేకపోవడంతో అతికష్టంగా భోజనం చేస్తున్నారు. గట్టి పదార్థాలు తినడం లేదు. అయితే ఓ వివాహ వేడుకకు హాజరు కాగా అక్కడ భోజనం చేస్తున్న సమయంలో పొరపాటున మటన్‌ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. అయితే ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మూడు రోజుల తర్వాత ఛాతీనొప్పితో బాధపడుతున్నారు. నొప్పి తీవ్రమవడంతో స్థానికంగా ఓ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తీసి గ్యాస్‌గా భావించి మందులు ఇచ్చారు. అయితే ఎంతకీ నొప్పి తగ్గలేదు. దీంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి శ్రీరాములు వెళ్లారు.

Also Read: Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్‌ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం


 


అక్కడ పరీక్షలు చేయగా శ్రీరాములు ఛాతీలో మటన్‌ ముక్క ఇరుక్కుపోయిందని గుర్తించారు. 3.5 మీటర్ల పొడవున్న ఎముక ఆహారనాళంలో అడ్డుపడింది. సాధారణంగా ముక్క ఇరుక్కుంటే వైద్యులు సులువుగా తీసేస్తారు. కానీ ముక్క ఇరుకుని కొన్ని రోజులు కావడంతో అక్కడ ఆహారనాళానికి నష్టం జరిగింది. ఆహార నాళానికి గాయమవడంతో సమస్య తీవ్రమైంది. అక్కడ ఇన్‌ఫెక్షన్‌ జరిగి పుండ్లు ఏర్పడ్డాయి. చీము కూడా చేరడంతో శస్త్రచికిత్స తప్పనిసరి చేయాల్సి ఉంది. గుండెకు చేరువగా ముక్క ఇరుక్కుపోవడంతో ఎండోస్కోపీ పద్ధతిలోనే అత్యంత జాగ్రత్తగా తీశారు. ఏమాత్రం అజాగ్రత్తతో ఉంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉండడంతో అతికష్టంగా ఎముకను తొలగించినట్లు కామినేని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.


అనేక జాగ్రత్తలు
ముక్క ఇరుక్కుపోవడంతో శస్త్ర చికిత్సను అత్యంత జాగ్రత్తతో చేశారు. కొన్ని రోజులు ఆయనకు కేవలం పూర్తిగా ద్రవ పదార్థాలు ఇచ్చారు. కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, జ్యూస్‌లాంటివి తీసుకున్నారు. చికిత్స పూర్తవడంతో కొద్దిగా జొన్న అన్నం, పెరుగన్నం శ్రీరాములు తింటున్నారు. ముక్క ఇన్‌ఫెక్షన్‌ చేయడంతో సమస్య పెరిగిందని కామినేని ఆస్పత్రి వైద్యురాలు రాధిక వివరించారు. కొన్నాళ్లు జాగ్రత్తలు తీసుకున్న అనంతరం సాధారణ భోజనం చేయవచ్చని పేర్కొన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter