Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్‌ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం

Tipplers Felicitated To Light Beers Hero Kotrangi Tharun In Mancherial: లైట్‌ బీర్లు లభించడం లేవని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంచలనం సృష్టించిన కొట్రంగి తరుణ్‌ను తాగుబోతులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. తమకు దొరికిన ఆణిముత్యం అంటూ అభినందిస్తూ సన్మానాలు చేస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2024, 07:37 PM IST
Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్‌ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం

Tipplers Hero: వేసవికాలం నేపథ్యంలో లైట్‌ బీర్లు దొరకడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాగుబోతుల సంఘం నాయకుడు కొట్రంగి తరుణ్ హీరోగా అయ్యాడు. తమ సమస్యను గుర్తించి ప్రభుత్వం, పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తిని ప్రజలు 'హీరో'గా అభివర్ణిస్తున్నారు. తమ బాధను పంచుకున్న వ్యక్తిని తాగుబోతులు ఘనంగా సన్మానించారు.

Also Read: Barrelakka: నా భర్తకు జీన్స్‌లు వేయడం నచ్చదు.. పూలు, గాజులు వేసుకోవాలంట: బర్రెలక్క

 

మద్యం దుకాణాలు, బార్లలో లైట్ బీర్లు లభించడం లేదని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన తాగుబోతుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్‌ను తాగుబోతులు ఘనంగా సన్మానించారు. మంచిర్యాలలో తరుణ్‌ను మంగళవారం కలిసిన కొందరు మద్యంప్రియులు సన్మానించి అతడిని అభినందించారు. తామందరం లైట్‌ బీర్లు లభించక ఇబ్బందులు పడుతుంటే.. మా గొంతుగా తరుణ్ ముందుకొచ్చాడని హర్షం వ్యక్తం చేశారు. తమ తరపున ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం హర్షణీయమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి లైట్‌ బీర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని తాగుబోతులు డిమాండ్‌ చేశారు.

Also Read: Leopard: చిరుతపులినే భయపెట్టారు.. గ్రామస్తుల మూకుమ్మడి దాడిలో 'పులి' బెంబేలు

 

తాగుబోతుల డిమాండ్
సన్మానం అనంతరం తాగుబోతుల సంఘం అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ మాట్లాడుతూ పలు డిమాండ్లు లేవనెత్తాడు. అనారోగ్యం పాలై ఆస్పత్రులకు వెళ్లిన తాగుబోతులకు 25% రాయితీ ఇవ్వాలని తరుణ్‌ డిమాండ్‌ చేశాడు. తాగుబోతులను మానసిక దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం వారికి నెలకు రూ.5 వేలు పింఛన్ ఇవ్వాలని కోరాడు. తాగి ప్రమాదానికి గురయిన వారికి ప్రభుత్వం తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. వాహనం నడుపుతూ చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం ఇవ్వాలన్నారు. 

తాగుబోతులు ఆరోగ్యాన్ని ఆస్తులను ప్రభుత్వానికి ధారబోస్తూ ప్రాణాలను కోల్పోతుండడంతో రూ.5 లక్షలు ఆర్థిక సాయం కొట్రంగి తరుణ్ డిమాండ్‌ చేశారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వెళ్తున్నట్లు ప్రకటించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News