Car Accident Viral Video: ఎవరికైనా భయంకరమైన ప్రమాదం ఎదురై... వాళ్లు ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బతికి బట్టకట్టినప్పుడు.. వీళ్లకు భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి అందుకే ఈ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారు అని అనడం చూస్తుంటాం. ఏదైనా ఘోర ప్రమాదం జరిగి.. అందులో ఎవ్వరికీ ఎలాంటి హానీ కలగకుండా బయటపడినప్పుడు ఆ ఘటనను అతి పెద్ద మిరాకిల్ అని చెప్పుకుంటుంటారు. ఒక్కోసారి చిన్నపాటి ప్రమాదాలే భారీ ప్రాణ నష్టాన్ని మిగిలిస్తుండగా.. అదే సమయంలో ఇంకొన్నిసార్లు ఘోర ప్రమాదాలు కూడా ఎలాంటి హానీ చేయకుండా జస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వైరల్ వీడియో కూడా అచ్చం ఆ రెండో రకానికి చెందినదే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలోని కొయికోడ్ జిల్లా కరుమాల వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటల 5 నిమిషాల సమయంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ప్రహరి గోడను బలంగా ఢీకొంది. అతివేగం మీద అదుపు తప్పడంతో ప్రహరి గోడను ఢీకొన్న కారు పల్టీలు కొడుతూ వచ్చి మళ్లీ రోడ్డుపైనే పడి గింగరాలు కొట్టింది. ఈ టెర్రిఫిక్ రోడ్ యాక్సిడెంట్ వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. 


సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూస్తే ఒళ్లు జలదరించేంత తీవ్రంగా ఉంది. చీకట్లలోంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన కారు.. కళ్లు మూసి తెరిచేలోపే గోడను ఢీకొట్టి రోడ్డుపైకి పల్టీలు కొట్టింది. కళ్ల ముందు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదాన్ని చూసిన ప్రత్యక్షసాక్షులు అదిరిపడ్డారు. అదే రోడ్డుపై అటుగా వెళ్తున్న వాహనదారులు, బైకర్స్ వెంటనే తమ వాహనాలను ఓ పక్కకు నిలిపి హుటాహుని కారు వద్దకు పరుగెత్తారు. కానీ అక్కడ పెద్ద మిరాకిల్ జరిగింది. అంత పెద్ద ప్రమాదంలోనూ అదృష్టం వారిని సురక్షితంగా కాపాడింది. కారు ప్రమాదం బారిన పడిన సమయంలో అందులో ఒక పసికందు సహా మొత్తం నలుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు వెనుక డోర్ అద్దాలు పగలడంతో ఒకరు అందులోంచి సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. 



 


అంత వేగంలో అంత పెద్ద ప్రమాదంలోనూ మిగతా ముగ్గురు కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కళ్ల ముందు జరిగిన అంత ఘోర ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటం చూసి ప్రత్యక్షసాక్షులే షాక్ అయ్యారు. తొలుత ఆ రోడ్డు ప్రమాదం చూసి అందరూ షాక్ అయినప్పటికీ.. తాము భయపడినట్టుగా ఎవ్వరికీ ఎలాంటి హాని జరగనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇది కూడా చదవండి : King Cobra Viral Video: 16 అడుగుల భారీ కింగ్‌ కోబ్రాను ఎలా పట్టుకున్నారో మీరే చూడండి.!


ఇది కూడా చదవండి : Snake Catcher Rescue King Cobra: ఈడు మగాడ్రా బుజ్జి.. 7 రోజులుగా ఉచ్చులోనే కింగ్ కోబ్రా.. దాహంతో అల్లాడుతున్న పాముకి నీరు తాగించిన వ్యక్తి!


ఇది కూడా చదవండి : 20 Feet Balck King Cobra: 20 అడుగుల కింగ్ కోబ్రాని ఈజీగా పట్టేసిన లేడీ.. కోబ్రా చారలు కూడా లెక్కపెట్టేసారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook