Lady Snake Catcher Catching Dangerous King Cobra: ఈ ప్రపంచంలో 'కింగ్ కోబ్రా' అత్యంత విషపూరితమైన సర్పం. సాధారణంగా ఈ పాము 12 నుంచి 20 అడుగుల పొడవు ఉంటుంది. కింగ్ కోబ్రా తన పొడవులో మూడో వంతు వరకు పడగ ఎత్తుతుంది. పోరాడే సమయంలో ఆరు అడుగుల వరకు పడగ ఎత్తి భీకరంగా చూస్తుంది. కింగ్ కోబ్రా కాటుకు వ్యక్తి 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం బతకడు. భారీ ఏనుగు సైతం కింగ్ కోబ్రా కాటుకు బలవుతుంది. కింగ్ కోబ్రా విషం మిగతా పాముల కంటే అత్యంత విషపూరితమైనది కాకున్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ మొత్తంలో విషం చిమ్మిస్తుంది. అందుకే కింగ్ కోబ్రా కాటేస్తే ఏ జీవైనా బ్రతకడం చాలా కష్టం.
చిన్న కింగ్ కోబ్రాను సైతం ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్స్ మాత్రమే పడుతుంటారు. భారీ కింగ్ కోబ్రా అప్పుడప్పుడు స్నేక్ క్యాచర్‌లకు కూడా చుక్కలు చూపిస్తుంది. 15-18 అడుగుల కింగ్ కోబ్రాలు అస్సలు చిక్కవు. అయితే కొందరు స్నేక్ క్యాచర్‌లు తమకు చిక్కని వాటిని టెక్నీక్ ఉపయోగించి చాలా సులువుగా పడుతుంటారు. లేడీ స్నేక్ క్యాచర్‌లు కూడా భారీ కింగ్ కోబ్రాలను పడుతుంటారు. ఓ యువ లేడీ స్నేక్ క్యాచర్ 15 అడుగుల కింగ్ కోబ్రాను చాలా సులువుగా పట్టింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు బ్లాక్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ఓ కొండ ప్రాంతానికి వెళతారు. వీరు వెళ్లేసరికి అది గడ్డిలో ఉంటుంది. మెల్లగా దాని తోక పట్టుకుని బయటికి తీసుకొచ్చే క్రమంలో దాడి చేసేందుకు మీదికి వస్తుంది. అయినా కూడా దాన్ని బయటికి తీసుకొస్తారు. ఒకరు తోక పట్టుకుని ఉండగా.. మరొకరు తల వైపు బ్యాగ్ పెట్టి ఉంచారు. ఆ బ్యాగును చూస్తూ ఉన్న సమయంలో ఓ లేడీ స్నేక్ క్యాచర్ వచ్చి బ్లాక్ కింగ్ కోబ్రా తలను పట్టేసింది. ఆపై దాన్ని అందరూ కలిసి పట్టుకున్నారు.
బ్లాక్ కింగ్ కోబ్రాను లేడీ స్నేక్ క్యాచర్ పట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను 'Nick Wildlife' అనే యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. ఈ వీడియోను 2 నెలల క్రితం పోస్ట్ చేయగా.. 381,576 వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: SUV Cars Under 6 Lakhs: 6 లక్షలకే సూపర్ ఎస్‌యూవీలు.. ఇంత తక్కువ బడ్జెట్‌లో మెరుగైన కారు మరేదిలేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి