Statue Of Liberty: ప్రపంచంలో వింత ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కట్టడాలు, నిర్మాణాలు చూసేందుకు సందర్శకులకు వెళ్తుంటారు. అయితే ఆ ప్రసిద్ధ కట్టడాలకు నకిలీ, డమ్మీ నిర్మాణాలు కూడా ఉంటుంటాయి. తాజాగా అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ నమూనాకు కూడా నకిలీది వచ్చేసింది. ఇకపై ఆ విగ్రహం చూడడానికి అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు. పంజాబ్‌లోని ఓ ప్రాంతానికి వెళ్లితే చాలు. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహ నమూనాను పంజాబ్‌లో ఓ నిర్మాణంపై నిర్మించుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు


పంజాబ్‌ రాష్ట్రంలో భవన నిర్మాణాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ భవనాలు, ఇళ్ల నిర్మాణాల్లో ప్రత్యేకత చాటుతారు. ఇంటి పైకప్పులు, వాటర్‌ ట్యాంక్‌లపై ప్రత్యేకంగా శిల్పాలు, ఆకారాలు నిర్మిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని తమ ఇంటి నిర్మాణాల్లో సృజనాత్మకత చూపిస్తారు. అందరి కన్నా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణాలపై, ఇళ్ల ముందు ప్రత్యేకతతో కూడిన విగ్రహాలు, శిల్పాలు, నమూనాలు, నిర్మాణాలు ప్రతిష్టిస్తుంటారు. బాడ్డీ బిల్డర్ల విగ్రహాలు, క్రూయిజ్‌ షిప్‌లు, పడవలు, మద్యం బాటిళ్లు, దేశంలోని ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు తదితర నిర్మించుకుంటారు. ఈ క్రమంలో ఓ ఎన్నారై తన గ్రామంలోని ఇంటిపై ప్రత్యేకంగా స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు.

Also Read: Women Sits In Pothole: రోడ్డు సమస్యపై మౌన నిరసన.. బురదలో కూర్చున్న మహిళ


పంజాబ్‌లోని మోగ జిల్లా లంగనియాన నవాన్‌ గ్రామానికి చెందిన ఎన్నారై గుర్మింత్‌ సింగ్‌ బ్రార్‌ అలియాస్‌ బబ్బూ కుటుంబం తమ ఇంటి నిర్మాణానికి అదనపు అందం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. గ్రామంలో నిర్మిస్తున్న తన భారీ భవనంపై స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. మన్‌జిత్‌ సింగ్‌ అనే శిల్పాకారుడు 18 అడుగుల స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని తయారుచేశాడు. తయారైన విగ్రహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంపై ప్రతిష్టిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అచ్చం అమెరికాలో ఉన్న మాదిరి విగ్రహం ఉండడంతో ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


అయితే ఆ విగ్రహం పెట్టడం వెనుక ఉన్న స్టోరీని భవన యజమాని అయిన వ్యాపారవేత్త గుర్మిత్‌ సింగ్‌ బ్రార్‌ వివరించాడు. చిన్నప్పటి నుంచి తాను అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నానని.. 2006లో అమెరికాకు వెళ్లి తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లు గుర్మిత్‌ సింగ్‌ తెలిపాడు. అక్కడ స్థిరపడ్డాక గ్రామంలో కూడా అమెరికాలో ప్రసిద్ధి పొందిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించానని వెల్లడించాడు. అందులో భాగంగా విగ్రహం ఏర్పాటుచేసినట్లు చెప్పాడు.  తన వ్యాపార అభివృద్ధికి కారణమైన అమెరికాకు గుర్తుగా స్వగ్రామంలో ఏమైనా ఉండాలని భావించి ఇలా చేసినట్లు తెలిపాడు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter