Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు

Marriage Cancelled Due To Groom Kissed To Bride: వరుడు ప్రేమతో.. సరదాగా చేసిన పని పెళ్లి రద్దవడమే కాకుండా పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఇరు కుటుంబసభ్యుల గొడవ తీవ్ర పరిణామాలకు దారితీసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 23, 2024, 06:28 PM IST
Kiss Stops Marriage: ప్రేమతో పెట్టిన ముద్దుతో వివాహం రద్దు.. ఆస్పత్రిలో వరుడు

Marriage Cancelled Bride Family Attack: కల్యాణ వేదికపై బంధుమిత్రులంతా వచ్చారు. కుటుంబసభ్యుల సమక్షంలో వరుడు వధువును పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పరస్పరం దండులు మార్చుకున్నారు. ఈ క్రమంలో వరుడు ప్రేమగా చేసిన చిన్న పని ఏకంగా పెళ్లి రద్దుకు దారి తీసింది. అంతేకాకుండా ఇరు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Also Read: Women Sits In Pothole: రోడ్డు సమస్యపై మౌన నిరసన.. బురదలో కూర్చున్న మహిళ

హాపూర్‌ జిల్లాలోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలకు వివాహం నిశ్చయించారు. ఈనెల 20వ తేదీన ఫంక్షన్‌ హాల్‌లో కుమార్తెల వివాహానికి భారీగా ఏర్పాట్లు జరిగాయి. మొదటి కుమార్తె వివాహం ప్రశాంతంగా జరిగింది. రెండో కుమార్తె వివాహం సయమంలో వివాదం మొదలైంది. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం వరుడు ప్రేమగా వధువుకు ముద్దు పెట్టాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు, బంధువులు షాకయ్యారు. పెళ్లి వేడుకలో ఇలా చేయడం తప్పుగా భావించారు. ముద్దు పెట్టడం వధువు కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు నచ్చలేదు.

Also Read: Snake Bite: తలుపు చాటున నక్కిన అత్యంత విషపూరిత పాము.. చటుక్కున కాటేసింది

వెంటనే వరుడితో వివాదానికి దిగారు. పరస్పరం వాదనలతో అక్కడ ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. వధువు తరఫు బంధువులు వరుడు, అతడి బంధువులపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఘర్షణల్లో ఏడుగురు గాయాలపాలయ్యారు. పోలీసులు విచారణ చేపట్టగా వధువు ఇష్టపూర్వకంగానే తాను ముద్దు పెట్టినట్లు వరుడు చెప్పాడు. అయితే దీనికి విరుద్ధంగా అమ్మాయికి ఇష్టం లేకపోయినా వరుడు బలవంతంగా ముద్దు పెట్టాడని వధువు బంధువులు పోలీసులకు వివరించారు. అయితే ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ప్రస్తుతం గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముద్దు కారణంగా జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News