Valentines Day 2023: ఒడిషాలోని జగత్‌సింగ్‌పూర్‌లో ఎస్వీఎం అటామనస్ కాలేజ్ యాజమాన్యానికి ఓ కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఆ కాలేజీ నోటీస్ బోర్డులో ఓ కొత్త నోటీస్ ప్రత్యక్షమైంది. అందులో ఏమని రాసి ఉందంటే.. ఫిబ్రవరి 14 2023 వాలెంటైన్స్ డే లోగా కాలేజీలో ఉన్న అమ్మాయిలు అందరూ కనీసం ఒక బాయ్ ఫ్రెండ్ నైనా అరేంజ్ చేసుకోవాలని.. లేని పక్షంలో ఆ రోజున కాలేజీలోకి అనుమతించేది లేదని కాలేజ్ యాజమాన్యం స్పష్టంచేసినట్టుగా ఆ నోటీసులో పేర్కొని ఉంది. ఈ నోటీస్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో కాలేజ్ యాజమాన్యం తలపట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్పందించి కాలేజ్ ప్రిన్సిపల్..
ఎస్‌వీఎం కాలేజ్ మేనేజ్మెంట్ పేరిట వైరల్ అవుతున్న నోటీస్ చూసి కాలేజ్ యాజమాన్యమే బిత్తరపోయింది. " ఇలాంటి చెండాలమైన పని మేము ఎందుకు చేస్తామని.. ఇది కాలేజ్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇంకెవరో చేసిన పని " అని కాలేజ్ ప్రిన్సిపల్ బిజయ్ పాత్ర తెలిపారు. ఇదే విషయమై ప్రిన్సిపల్ బిజయ్ పాత్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన పేరిట ఉన్న లెటర్ హెడ్‌ని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని.. ఈ ఫోర్జరీకి పాల్పడింది ఎవరో కనిపెట్టి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ బిజయ్ పాత్ర తన ఫిర్యాదులో పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


ఒడిషాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అదే కాలేజ్ విద్యార్థిని రష్మిక బెహరా స్పందిస్తూ.. " సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసు ఫేక్ నోటీసు అనే విషయం అందరికీ తెలుసు " అని అన్నారు. " తమ కాలేజ్ ప్రిన్సిపల్ సర్ మంచి వారు. ఆయన అలాంటి పనులు చేస్తారంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎవ్వరూ నమ్మరు. కాలేజ్ ప్రతిష్టను మంటగలిపేందుకు ఎవరో గిట్టని వారు చేసిన పని ఇది. దీని వల్ల తమ కాలేజ్ యాజమాన్యం అబాసుపాలైంది " అని రష్మిక బెహరా అభిప్రాయపడ్డారు.


ఇది కూడా చదవండి : Homeless Old Man: బతికున్న వృద్ధుడిని చెత్త ట్రాక్టర్ ఎక్కించిన శానిటరి సిబ్బంది


ఇది కూడా చదవండి : Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం


ఇది కూడా చదవండి : Attack On Fruit Vendor: రూ. 5 కోసం పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిపై పైశాక దాడి.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook