Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం

Shocking Viral Video: బైక్‌పై వేగంగా వెళ్తున్న ఒక వ్యక్తిని గాలిలోంచి ఏదో తెలియని వస్తువు ఎగిరొచ్చి తగిలింది. ఆ వస్తువు బారి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా అతడికి లేకపోయింది. అతడు ఉన్న వేగం ధాటికి ఆ వస్తువు తగలడంతోనే అతడు బైక్ పై నుంచి వెనక్కి ఎగ్గిరిపడ్డాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 05:36 PM IST
Shocking Viral Video: గాల్లో కొట్టుకొచ్చిన వస్తువు తగిలి బైక్‌పై ఉన్న మనిషి అదృశ్యం

Shocking Viral Video of Flying Object Hits Bike Rider: బైక్స్ అంటే ఎవరికైనా క్రేజీనే. అది కూడా మంచి స్పోర్ట్స్ బైక్‌పై లాంగ్ రైడ్ వెళ్లడం అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే వారికి బైక్‌పై ఎంత దూరం ట్రావెల్ చేసినా అలుపు అనేది రాదు. కాకపోతే ఇక్కడ ఒక రిస్క్ ఉంది. బైక్‌పై వెళ్లేటప్పుడు ఏ చిన్న తప్పిదం జరిగినా, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోకప్పదు. వేగాన్నిబట్టి ప్రమాదం తీవ్రత ఉంటుంది. బైక్ నెమ్మదిగా వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం ఎదురైతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చునేమో కానీ వేగంగా వెళ్లేటప్పుడు మాత్రం చిన్న ప్రమాదం కూడా ఊహించని నష్టాన్ని మిగిలిస్తుంది. కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

బైక్‌పై వేగంగా వెళ్తున్న ఒక వ్యక్తిని గాలిలోంచి ఏదో తెలియని వస్తువు ఎగిరొచ్చి తగిలింది. ఆ వస్తువు బారి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా అతడికి లేకపోయింది. అతడు ఉన్న వేగం ధాటికి ఆ వస్తువు తగలడంతోనే అతడు బైక్ పై నుంచి వెనక్కి ఎగ్గిరిపడ్డాడు. బైక్ మాత్రం అదే వేగంతో కొంతదూరం వరకు నేరుగా దూసుకుంటూ వెళ్లి రోడ్డుకి కుడివైపున ఉన్న ఫుట్ పాత్ ని ఢీకొని ఫుట్ పాత్ పైకి ఎగిరిపడింది. 

ఈ ఘటనలో బైక్ రైడర్ బైక్‌పై నుంచి పడిపోయిన తీరు చూస్తే.. అతడు బైక్ పై నుంచి దాదాపు అదృశ్యమయినట్టుగానే ఉంది. ఈ వీడియో చూస్తోంటే.. ఆ బైక్ వెనకే వస్తున్న మరో వాహనంలో ఉన్న డాష్‌బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యం రికార్డైనట్టుగా కనిపిస్తోంది. అందువల్లే ఈ రోడ్డు యాక్సిడెంట్ తర్వాత బైక్ రైడర్ కి ఏమైంది అనేది ఈ వీడియోలో రికార్డ్ అవలేదు. కానీ ప్రమాదం జరిగిన తీరు, అతడి ఒక్క ఉదుటున గాల్లోకి లేచి వెనక్కి ఎగిరిపడిన తీరు చూస్తే.. ప్రమాదం తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని అనిపిస్తోంది.

Trending News