Optical Illusion IQ Test: ఈ చిత్రంలో దాగున్న పిల్లులను 30 సెకన్లలో గుర్తించగలరా.. ట్రై చేయండి..
Optical Illusion IQ Test: ఇక్కడొక ఆప్టికల్ ఇల్యూజన్ ఉంది.. ఈ చిత్రంలో దాగున్న రెండు పిల్లులను 30 సెకన్లలో గుర్తించగలరేమో ప్రయత్నించండి..
Optical Illusion IQ Test: ఆప్టికల్ ఇల్యూజన్స్ మన కళ్లను భలే భ్రమింపజేస్తాయి. పైపైన చూస్తే కనిపించే చిత్రం వేరు.. కాస్త పరీక్షించి చూస్తే కనిపించే చిత్రం వేరు. లేదా అందులో ఎక్కడో కనిపించీ కనిపించనట్లుగా వస్తువులు గానీ, జంతువులు గానీ దాగుండి ఉంటాయి. కొంతమంది ఈ తేడాలను సులువుగా గుర్తుపట్టగలరు. మరికొందరు కాస్త సమయం తీసుకునైనా సరే గుర్తించగలరు. ఇంకొందరికీ అదొక పెద్ద మిస్టరీలా అనిపించవచ్చు. ఈ మూడింటిలో మీరు ఏ కేటగిరీలోకి వస్తారో ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ద్వారా టెస్ట్ చేసుకోండి.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. ఒక పాప నేలపై కూర్చొని బొమ్మలతో ఆడుకుంటోంది. సాధారణంగా చూస్తే ఇందులో ఇంతే కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో రెండు పిల్లులు దాగున్నాయి. అవి ఎక్కడ దాగున్నాయో 30 సెకన్లలో గుర్తించగలిగితే మీ బ్రెయిన్ చాలా షార్ప్‌గా ఉన్నట్లు. కానీ 99 శాతం మంది ఈ టెస్టులో ఫెయిల్ అవుతారు. కొంతమంది ఒక పిల్లిని గుర్తిస్తే రెండో పిల్లిని గుర్తించలేరు.
మీరు ఇప్పటికీ అందులో దాగున్న పిల్లులను గుర్తించనట్లయితే మీకోసం ఒక క్లూ కూడా ఇస్తున్నాం. ఆ కుర్చీల్లో కూర్చొన్న వ్యక్తులను కింద నుంచి పై దాకా బాగా గమనించండి. ఇప్పుడు సులువుగా గుర్తు పట్టగలరు. ఒకవేళ ఇప్పటికీ మీరు గుర్తించలేకపోతే ఇక కష్టపడకండి. ఆ పిల్లులు ఎక్కడ దాగున్నాయో ఈ కింది చిత్రంలో చూడండి. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూజన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
[[{"fid":"243825","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also Read: IND vs PAK: భారత్ అరుదైన రికార్డును బ్రేక్ చేసిన పాకిస్తాన్.. టాప్‌లో శ్రీలంక!
Also Read: Sujatha: షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత సూసైడ్.. అవినీతి కేసులో గతంలో అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook