Optical Illusion Challenge: ఆప్టికల్ ఇల్యూజన్స్ ఐక్యూని టెస్ట్ చేస్తాయి. కొంతమంది ఆప్టికల్ ఇల్యూజన్స్‌ని చూడగానే అందులోని లాజిక్‌ని, లేదా దాగున్న చిత్రాన్ని ఇట్టే గుర్తిస్తారు. మరికొంతమంది చాలాసేపు పరీక్షగా చూస్తే తప్ప గుర్తించలేరు. ఇంకొంతమంది ఎంతసేపు ఆ చిత్రాన్ని చూసినా లాజిక్‌ని అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే ఆప్టికల్ ఇల్యూజన్స్ మెదడుకు మేత లాంటివని చెప్పవచ్చు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూజన్ నెట్టింట వైరల్ అవుతోంది. మీ బ్రెయిన్ చాలా షార్ప్ అయితే ఈ సవాల్‌ను స్వీకరించండి..
సవాల్ ఇదే.. :
పైన ఉన్న చిత్రాన్ని చూడగానే మొదట మీకు కనిపించేది కుక్క. దాని వెనక ఓ చెట్టు, చుట్టుపక్కల చిన్న పొదళ్లు, దూరాన పారుతున్న ఓ నది. పైపైనే చూస్తే ఇంతే కనిపిస్తాయి. కానీ పరీక్షగా చూస్తే ఇందులో ఒక పిల్లిని గమనించవచ్చు. మీరు ఇంటలిజెంట్ వ్యక్తులైతే కేవలం 13 సెకన్లలో దీన్ని గుర్తించగలగాలి. కేవలం 1 శాతం మంది మాత్రమే 13 సెకన్లలో ఆ పిల్లిని గుర్తించగలరు. ఆ ఒక శాతం మందిలో మీరు ఉన్నారో లేదో సెల్ఫ్ చెక్ చేసుకోండి.
పిల్లిని కనుగొనేందుకు ఇదిగో క్లూ :
మొదటిసారి చూడగానే ఆ చిత్రంలో దాగున్న పిల్లిని గుర్తించడం చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. అందుకోసం ఇక్కడ రెండు క్లూస్ కూడా ఇస్తున్నాం. వాటి ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేయండి.
ఫస్ట్ క్లూ : పిల్లి ఆ కుక్క ఉన్న చోట లేదు
సెకండ్ క్లూ : పిల్లి నేలపై లేదు
పిల్లి ఎక్కడ ఉందంటే.. :
ఇప్పటికీ మీరు పిల్లిని గుర్తుపట్టనట్లయితే.. ఈసారి చెట్టు కొమ్మలపై పరీక్షగా చూడండి. ఎడమ వైపు పెద్ద కొమ్మ పక్కనే ఉన్న చిన్న కొమ్మపై పిల్లి ఆకారం కనిపిస్తుంది. సమాధానం తెలిశాక.. హర్రే ఎలా మిస్సయిపోయామని అనిపిస్తుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్, పజిల్స్, సుడోకు లాంటివి తరచూ ప్రాక్టీస్ చేస్తే బ్రెయిన్ మరింత షార్ప్ అవుతుంది.
Also Read: TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై విద్యార్థులకు కీలక అప్‌డేట్...
Also Read: Pradeep Patwardhan: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ హఠాన్మరణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook