Sujatha: హైదరాబాద్ జిల్లా షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత అనుమనాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె నివాసంలోనే ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం గుండెపోటుతో మరణించిందని చెబుతున్నారు. 2020లో బంజారాహిల్స్ లోని అత్యంత విలువైన భూ వివాదం కేసులో సుజాతను ఏసీబీ అరెస్ట్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో సుజాత కేసు సంచలనమైంది. షేక్ పేట తహశీల్దార్ గా ఉన్న సమయంలోఆమె భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో సుజాత నివాసంలో జరిగిన సోదాల్లో వందల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ కేసులో సుజాత జైలుకు వెళ్లింది. గత ఏడాది సుజాత భర్త సూసైడ్ చేసుకున్నారు. ఇంటి భవనం పై నుంచి దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నాడు. అవినీతి కేసులో సుజాత అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు చెప్పారు. మనో వేదనతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. భర్త చనిపోయినప్పటి నుంచి సుజాత కూడా డిప్రెషన్ లో ఉందంటున్నారు. మానసిక సమస్యలతోనే సుజాత కూడా సూసైడ్ చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
2020 జూన్ లో భూ వివాదంకేసులో 15 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఏసీబీకి దొరికిపోయాడు. ఆర్ఐని విచారించగా.. ఈ వ్యవహారంలో కేసు మాఫీ చేసేందుకుబంజారాహిల్స్ ఎస్ఐ రవీంద్రనాయక్ లంచం తీసుకున్నారని తేలింది. అతన్ని కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. ల్యాండ్ సెటిల్ మెంట్ లో అప్పటి షేక్ పేట్ తహశీల్దార్ సుజాత పాత్ర ఉండటంతో ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా సుజాత నివాసంలో నోట్ల కట్టలు లభించాయి.30 లక్షల రూపాయల నగదుతో పాటు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు దొరికాయి. సుజాత ఇంట్లో దొరికి నగదు చూసి ఏసీబీ అధికారులు షాకయ్యారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమైంది.
#Interesting: ACB laid it's 1st trap on Friday, and hit 3 birds with one stone. Sleuths arrested Revenue inspector & Sub- Inspector- Banjara hills for accepting bribe from a land lord. But the trap, also led them to Shaikpet Tahsildar's house, where 30L cash was found. pic.twitter.com/BFeRrvasXf
— @Coreena Enet Suares (@CoreenaSuares2) June 6, 2020
Also Read : Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?
Also Read: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి