Pakistani Artist Gift: భారత దేశ ప్రజలకు పాకిస్తానీ కళాకారుడి అద్భుత గిఫ్ట్.. వీడియో వైరల్!
Pakistan Rabab artist Siyal Khan plays Indian National Anthem. పాకిస్థానీ కళాకారుడు సియాల్ ఖాన్ నిర్మలమైన పర్వతాల మధ్య కూర్చుకుని తన గిటార్‌తో భారత జాతీయ గీతం `జన గణ మనని` ప్లే చేశారు.
Pakistan Rabab artist Siyal Khan Plays Indian National Anthem: నేడు భారత్ 75వ స్వాతంత్య్ర వేడుకలు (Independence Day) జరుపుకొన్నది. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతీయులు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందారు. విదేశీ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొంది నేటికి 75 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా రాజధాని ఢిల్లీ నుంచి.. మారుమూల గ్రామాల వరకు స్వాతంత్య్ర మహోత్సవాలను భారత ప్రజలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఇతర దేశాల ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాయాది పాకిస్థానీ రబాబ్ కళాకారుడు సియాల్ ఖాన్ భారత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
పాకిస్థానీ కళాకారుడు సియాల్ ఖాన్ నిర్మలమైన పర్వతాల మధ్య కూర్చుకుని తన గిటార్‌తో భారత జాతీయ గీతం 'జన గణ మనని' ప్లే చేశారు. ఒక నిమిషం 22 సెకన్ల పాటు సియాల్ ఖాన్ భారత జాతీయ గీతంను ప్లే చేశారు. ఈ జాతీయ గీతం ట్యూన్ చాలా బాగుంది. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. హృదయాన్ని కదిలించే ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సియాల్ భారత ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
ఈ వీడియోను పాకిస్థానీ కళాకారుడు సియాల్ ఖాన్ షేర్ చేస్తూ 'సరిహద్దు ఆవల ఉన్న నా వీక్షకులకు ఇదే నా బహుమతి' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. సియాల్ ఖాన్ పోస్ట్ చేసిన వీడియోకి 6 లక్షల 50వేలకు పైగా వ్యూస్ రాగా.. దాదాపు 40 వేల లైక్‌లు వచ్చాయి. ఇక ఇదివరకు సియాల్ ఖాన్ 'ఫనా' పాటకు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు.
Also Read: వన్‌ప్లస్ టీవీపై రూ. 12వేల తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా!ఈ అవకాశం ఒక్క రోజే
Also Read: టాలీవుడ్ టాపర్లుగా ఎన్టీఆర్, సమంత.. టాప్ టెన్లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook