Online Classes Instructions: ఆన్లైన్లో ఏది చేయకూడదు, ఏది చేయాలో తప్పనిసరిగా తెలుసుకోండి
Online Classes Instructions: కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రపంచమంతా ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్కూల్స్, కళాశాలల్లో ఆన్‌లైన్ బోధన తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఏది చేయకూడదో..ఏది చేయాలనే సూచనల్ని తల్లిదండ్రులు, విద్యార్ధుల కోసం ప్రభుత్వం జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.
Online Classes Instructions: కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రపంచమంతా ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్కూల్స్, కళాశాలల్లో ఆన్‌లైన్ బోధన తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఏది చేయకూడదో..ఏది చేయాలనే సూచనల్ని తల్లిదండ్రులు, విద్యార్ధుల కోసం ప్రభుత్వం జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం.
ఆన్‌లైన్ బోధన (Online Classes), విద్యను కరోనా మహమ్మారి తప్పనిసరి చేసింది. గత రెండేళ్లుగా ఇదే జరుగుతోంది. కోచింగ్ అయినా, స్కూలింగ్ అయినా లేదా కళాశాలలైనా అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇవి కాకుండా కొన్ని ఎడ్‌టెక్ కంపెనీలు ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తల్లిదండ్రులు, విద్యార్ధుల కోసం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్ కోర్సుల గురించి జాగ్రత్తలు చేసింది. కొన్ని ఎడ్‌టెక్ కంపెనీలు ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సుల పేరుతో ఎలక్ట్రానికి ఫండ్ ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి చేయడం, ఆటోడెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేయడం చేస్తూ దోచుకుంటున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇటువంటి ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డూస్ అండ్ డోన్ట్స్ జాబితా (Dos and Donts list)విడుదల చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్ధుల్ని అప్రమత్తం చేస్తోంది.
ఏది చేయకూడదు
చెల్లింపులు (Payments)లేదా సబ్‌స్క్రిప్షన్ కోసం ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ ఇవ్వకూడదు. కొన్ని ఎడ్‌టెక్ కంపెనీలు ముందు ఉచిత ప్రీమియం బిజినెస్ ఆఫర్ చేసి..తరువాత సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆటోడెబిట్ ఆప్షన్ యాక్టివేట్ చేయమంటున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇక ఆన్‌లైన్ రుణాలకు సంబంధించి కూడా పూర్తిగా నిర్ధారణ చేసుకోకుండా సంతకాలు చేయవద్దు. పూర్తిగా తెలుసుకోకుండా ఏ విధమైన ఎడ్‌టెక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఆ యాప్ అథెంటిసిటీ నిర్దారణ చేసుకోవడం తప్పనిసరి. ఇక సబ్‌స్క్రిప్షన్ కోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడటం పూర్తిగా మానేయండి. వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ విషయంలో అప్రమత్తం చేయాలి. అనిర్దారిత వేదికలపై అస్సలు చేయకూడదు. వెరిపైడ్ కాని కోర్సులకు ఎప్పుడూ డబ్బులు చెల్లించవద్దు. ఎడ్‌టెక్ కంపెనీలు షేర్ చేసే సక్సెస్ స్టోరీల్ని ఎప్పుడూ నమ్మవద్దు. కోర్సులకు సంబంధించిన మెటీరియల్ లేదా కంటెంట్ కోసం యాప్ ద్వారా కొనుగోలు చేయవద్దు. మీ ఓటీపీ నెంబర్ లేదా బ్యాంక్ ఎక్కౌంట్ వివరాల్ని ఎప్పుడూ, ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఇది సైబర్ మోసాలకు దారి తీస్తుంది. మీకు తెలియని లింకులు లేదా పాప్‌అప్ స్క్రీన్స్‌ను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.
ఏది చేయవచ్చు
సాఫ్ట్‌వేర్ లేదా డివైస్‌కు సంబంధించి నిర్దారణ చేసేటప్పుడు పూర్తిగా నిబంధనల్ని చదివిన తరువాతే యాక్సెప్ట్ చేయండి. ఎడ్యుకేషనల్ డివైసెస్ లేదా కంటెంట్ లేదా యాప్ పర్చేజెస్ కోసం ట్యాక్స్ ఇన్‌వాయిస్ స్టేట్‌మెంట్ అడగడం మర్చిపోవద్దు. ఇనిస్టిట్యూట్ నేపధ్యం గురించి పూర్తిగా చెక్ చేయండి. చెక్ చేసిన తరువాతే ఎడ్‌టెక్ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించండి. ఆ కంపెనీలు అందించే కంటెంట్ క్వాలిటీని నిర్ధారించుకోండి. ఫీ చెల్లించేటప్పుడే మీకు తలెత్తే సందేహాల్ని అడిగి నివృత్తి చేసుకోండి. మీ పిల్లలు వినియోగించే డివైస్‌పై తల్లిదండ్రుల కంట్రోల్, సేఫ్టీ ఫీచర్స్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఎడ్‌టెక్ కంపెనీలు (EdTech Companies) తమ బిజినెస్ అభివృద్ది కోసం చేసే మార్కెటింగ్ వ్యూహాలు, మోసాల గురించి మీ పిల్లలకు అవగాహన కల్పించండి. స్పామ్ కాల్స్ లేదా ఎడ్యుకేషన్ ప్యాకేజెస్‌పై బలవంతంగా సైనింగ్ చేయించడం వంటివాటిని ప్రూఫ్ కోసం రికార్డు చేసుకోవడం మంచిది.
Also read: Bride Groom funny video : గుర్రం ఎక్కుదామంటే పబ్లిక్‌లో పెళ్లికొడుకు ప్యాంట్ చిరిగింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook