డిజిటల్ మాధ్యమం ద్వారా పేమెంట్స్ చేసే సంస్థ "పేటీఎం" ఇప్పుడు వ్యాపార లావాదేవీలు చేసేవారి కోసం ఒక సరికొత్త యాప్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. దాని పేరే ‘పేటీఎం ఫర్‌ బిజినెస్‌’. ఈ యాప్ ద్వారా వ్యాపారులు లాగిన్ అవ్వగానే డిజిటల్ పేమెంట్స్ స్వీకరించవచ్చు. ఈ యాప్ ఒక సులువైన యాప్ అని.. చిన్న చిన్న హోటళ్లు, తినుబండారాలు, వస్తువులు అమ్ముకొనే వ్యాపారస్తులు కూడా చాలా ఈజీగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్స్ స్వీకరించవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి యాప్‌‌ను వాట్సాప్ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో.. పేటీఎం కూడా అదే బాటలో ప్రయాణించడం విశేషం. దాదాపు పది ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ తన వినియోగదారులకు సేవలను అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలపడం గమనార్హం.