Peacock Viral Video: భారతదేశ జాతీయ పక్షి నెమలి. నెమలి ప్రతి కదలిక అందమే. ఎగిరినా అందమే..నృత్యం చేసినా మకరందమే. నెమలిని చూడటమే ఓ అరుదైన ఆనందం. నెమలి అలా చెట్ల చాటు నుంచి గాలిలో ఎగురుతూ పోతుంటే..చూసేందుకు రెండు కళ్లు చాలవు కదా..అందుకే ఆ వీడియో అంతగా వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వైరల్ వీడియోలో మీరు ఎగిరే నెమలిని స్పష్టంగా చూడవచ్చు. నెమలి ప్రతి కదలికా కంటికి ఆనందాన్ని..అందాన్ని చూపిస్తుంది. నెమలి ఆనందంగా ఉన్నప్పుడు, వాతావరణం ఆహ్లాదంగా ఉన్నప్పుడు అందమైన రెక్కల్ని పూర్తిగా విప్పి మరీ నృత్యం చేస్తుంటుంది. ఈ దృశ్యం చాలా అరుదుగానే కన్పిస్తుంది. అటువంటిది ఓ అందమైన నెమలి చెట్ల చాటు నుంచి గాలిలో..రెక్కలు ఆడిస్తూ..అలా ఎగురుతూ వెళ్తుంటే ఎలా ఉంటుంది..చూడ్డానికి రెండు కళ్లు చాలవు కదా. అదే జరిగింది ఈ వీడియోలో. అందుకే ఆ వీడియో అంతగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను 40 లక్షలకు పైగా చూసేశారు. పెద్దఎత్తున లైక్స్ వస్తున్నాయి.



ఇంటర్నెట్ అనేది ఆసక్తికరమైన వీడియోలతో నిండిన ప్రపంచం. ఎప్పుడు ఎలాంటి వీడియోలు  వస్తాయో తెలియదు. వస్తే చాలు వైరల్ అవుతుంటాయి. జంతు ప్రపంచానికి సంబంధించిన వీడియోలైతే వెంటనే వైరల్ అయిపోతాయి. ఇప్పుడు ఓ నెమలి హాయిగా ఎగురుతున్న వీడియో వైరల్ అవుతోంది. వైరల్ అవుతుందని కాదు గానీ..నిజంగా ఈ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. పదే పదే మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తోంది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కూడా కాస్త స్లో మోషన్‌లో షేర్ చేయడంతో ఇంకా అందంగా కన్పిస్తుంది. 


నెమలి ఎగురుతూ కన్పించడం అనేది చాలా అరుదైన దృశ్యం. ఎందుకంటే ఇతర పక్షులతో పోలిస్తే వాటి శరీరం బరువగా ఉంటుంది. అందుకే ఎక్కువ దూరం ఎగరవు. ఎప్పుడైనా ఎగిరినా కొద్ది దూరం మాత్రమే. అందుకే ఈ వీడియో అంతగా వైరల్ అవుతోంది. 14సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకూ 4 మిలియన్ల మంది వీక్షించారు. 23 వేల రీట్వీట్స్ వచ్చాయి. దాదాపు 3 వేలమంది కామెంట్లు చేయగా..1 లక్షా 68వేల లైక్స్ వచ్చిపడ్డాయి.


Also read: Kohli Viral Video: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌ను కాపీ కొట్టిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.